విశాఖ ఎంపి హరిబాబుకు కేంద్రమంత్రి పదవి?

First Published Jul 18, 2017, 11:25 AM IST
Highlights
  • విశాఖ లోక్ సభ సభ్యుడు హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి
  • సోమూ వీర్రాజుకు బిజెపి రాష్ట్ర కమిటి
  •  వెంకయ్య నాయుడి అనంతరం కొత్త పరిణామాలు
  •  బిజెపిలో చంద్రబాబు మిత్రబృందానికి కష్టాలు

బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా  ఎంపిక కావడం రాష్ట్ర కమిటిలో అనూహ్య పరిణామాలకు తెరలేపనుంది.ఇంత వరకురాష్ట్ర కమిటీ మీద వెంకయ్య ప్రభావం తీవ్రంగా ఉండేది. ఆయనతో సంప్రదించకుండా ఏపని జరిగేది కాదు. అలాగే ఆయన అనుమతి లేకుండా  ఏ నియామకాలు జరిగే వి కాదు.  ఇపుడు ఆయన ఉప రాష్ట్రపతి అవుతూ ఉండటంతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఆమిత్ షా- రామ్ మాదవ్ అజండా అమలుజరగుతుందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా ఎపుడు రాష్ట్రకమిటీ అధ్యక్షుడిగా ఉన్న కంభ ం పాటి హరిబాబును ఆ పదవి నుంచి తప్పించబోతున్నారు. ఆయన విశాఖపట్టణం లోక సభ సభ్యుడు కాబట్టి ఆయనను  కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకునే విషయాన్ని బిజెపి  అధిష్టానం యోచిస్తున్నది. ఇపుడు వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నందున రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతూఉందని,  ఇపుడు ఆయన ఉప రాష్ట్రపతి కావడంతో రాష్ట్రానికి నష్టం అనే అభిప్రాయం ఒక సెక్షన్ లో  బలంగా ఉంది. అందువల్ల ఈ విషయంలో అలాంటి అపోహలు తొలగించేందుకు హరిబాబు ను కేంద్ర క్యాబినెట్ లో కి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని సీనియర్ బిజెపి నాయకులొకరు ‘ఏషియానెట్ ’  కుతెలిపారు.

అపుడు ఆయన  రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారు. ఈ పదవిని పార్టీ ఎంపి సోము వీర్రాజును అప్పచెబుతారు. నిజానికి సోము వీర్రాజు పేరు ఎపుడో ఖరారయింది. అయితే, చంద్రబాబు విమర్శకుడి పేరున్న  సోమూవీర్రాజును పార్టీ అధ్యక్షుడిని చేస్తే బిజెపి-టిడిపి సంబంధాలు చెడిపోతాయని వెంక్కయనాయుడు  వాదించి ఈ నియామం వాయిదా వేయించారని చెబుతారు. ఫలితంగా రాష్ట్ర కమిటీకి చంద్రబాబు మిత్ర బృందం నాయకత్వమే కంటిన్యూ అయింది.ఎపుడో టర్మ్ అయిపోయినా ప్రొఫెసర్ హరిబాబు అధ్యక్షుడిగా కొనిసాగారు. దీనికి కులం కూడా ఒక కారణమని చాలామంది అనుమానం.

 ఉపరాష్ట్రపతి ఎన్నికయిపోగానే ఈ కొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయని, బిజెపి స్వరూపం మారిపోతుందని తెలిసింది.

click me!