ఉండవల్లి-గోరంట్ల చర్చకు అనుమతి నిరాకరణ

First Published Jul 18, 2017, 8:15 AM IST
Highlights
  • ఉండవల్లి పట్టి సీమ బహిరంగ చర్చ సాధ్యమయ్యేలా లేదు
  • టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందుకు వచ్చినా పోలీసులు అనుమతి  నీయలేదు
  • విజయవాడలో నిషేదాజ్ఞలున్నందున అనుమతి నిరాకరణ

ఏంతో ఉత్కంఠ రేపిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్- తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పట్టి సీమ బహిరంగ చర్చ తుస్సుమంది.

విజయవాడ పోలీసులు చర్చకు అనుమతి  నిరాకరించారు. మంగళవారం నాడు ఈ చర్చ జరుగుతుందని, అనుమతినీయాలని బుచ్చయ్య చౌదరి పోలీసులను కోరారు. అయితే,నగరంలో సెక్షన్ 30 అమలులో ఉన్నందున అనుమతినీయలేమని పోలీసులు తెలిపారు. అనుమతి కోసం బుచ్చయ్య చౌదరి సోమవారంనాడు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ను కలిశారు. అయితే, ఆయన అనుమతి నీయలేమని చెప్పారు.

ఇపుడేమవుతుందో చూడాలి. వేదిక మారుతుందా, అసలు చర్చే రద్దువుతుందా?

పట్టి సీమ ఒక ఫ్రాడ్అని, కమిషన్ ల  ప్రాజక్టుఅని మాజీ రాజమండ్రి ఎంపి అరుణ్  కుమార్ వాదిస్తూవస్తున్నారు. దీని మీద తాను బహిరంగ చర్చకు సిద్ధమని  ప్రకటించారు. అయితే, ప్రభుత్వం నుంచి గాని, తెలుగుదేశం పార్టీ నుంచి దీనికి స్పందన రాలేదు. చివరకు రాజమండ్రి టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందుకు వచ్చారు. అరుణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

తీరా అంతాసి చర్చకోసం ఎదురుచూస్తున్నపుడు పోలీసుల చర్చకు అనుమతి రాలేదు.

అరుణ్ కుమార్ దీనికి ఎమంటారో చూడాలి.

click me!