క్రికెట‌ర్ కూతురుతో డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ (వీడియో)

Published : Aug 29, 2017, 02:20 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
క్రికెట‌ర్ కూతురుతో డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ (వీడియో)

సారాంశం

కోహ్లీ చిన్నారితో చేసిన డ్యాన్స్ వైరల్ అవుతుంది. షమీ కుతురుతో డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ.

భార‌త్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స‌హాచ‌ర స‌భ్యుడు బౌల‌ర్ మహ్మద్‌ షమీ కూతురుతో డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఆ డాన్స్‌ వీడియో వైరల్ అవుతోంది. శ్రీలంక‌తో భార‌త్ 3-0 తో సిరీస్ కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. భార‌త్ జ‌ట్టు స‌భ్యులు సంబ‌రాల్లో మునిగిపోయారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఎంత మంచి డాన్సరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌ సీజన్ లో  రాయ్‌ ఛాలెంజర్స్ బెంగళూర్‌ తరపున తన టీం సభ్యులతో జరుపుకున్న పార్టీల్లో క్రిస్‌ గేల్‌ తో కలిసి చిందులేయటం చూశాం. అంతేకాదు టీమిండియా వేడుకల్లో, చివరకు యువీ, భజ్జీ పెళ్లి వేడుకల్లో కూడా స్టెప్పులేశాడు. 
 

 టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ రెండేళ్ల కూతురు అరియాతో కలిసి బెగా హిట్ సాంగ్ అయినా 'ఐ గాట్‌ ఏ గర్ల్' అనే ఇంగ్లీషు పాట డాన్స్ చేశాడు. ఈ వీడియోను ష‌మీ త‌న ట్విట్ట‌ర్ లో పోస్టు చేశాడు. అంద‌రు సూప‌ర్బ్ డ్యాన్స్‌... అని, కోహ్లీ యూ ఆర్‌ ది బెస్ట్ అని.. నెటిజ‌న్లు త‌న‌దైనా రీతిలో కామేంట్లు చేస్తున్నారు.  

 

 

 

తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి https://goo.gl/S9T44B

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !