గోస్పాడు లో జగన్ కు ఎదురుదెబ్బ ఎలా తగిలింది?

Published : Aug 29, 2017, 02:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
గోస్పాడు లో జగన్ కు ఎదురుదెబ్బ ఎలా తగిలింది?

సారాంశం

ఈ మండలంలో పూర్తి మెజారిటీ వస్తుందని, దానితో నంద్యాల టవున్లో పోయే వోట్ల గండి పూడుతుందని వైసిపి నేతలు చెబుతూ వచ్చారు. రాజకీయాల్లో పెట్టని కోటలేవీ ఉండవని, కోటలుగా బీటలు వారుతాయని గోస్పాడు రుజువు చేసింది. ఈ మండలంలో టిడిపికి  వైసిపి కంటే ఎక్కవ ఓట్ల రావడంతో టిడిపి ఇపుడు ఎగిరి గంతేస్తా ఉంది. 

గోస్పాడు అనే ఊరు ఎపుడూ వార్తల్లో లేదు. ఉండేంత విశేషాలున్న పల్లెకాదు. బహుశా ఎపుడయిన వార్త లకెక్కి ఉంటే, అంది ఒకటో అరోనాటు బాంబులు పెలడం వల్లో లేదా దొరకడం వల్లనో అయి ఉంటుంది. అయితే, నంద్యాల ఉప ఎన్నికల పుణ్యాన గోస్పాడు రోజు చర్చల్లోకొచ్చింది. పెద్ద వార్తయింది. కారణం, ఈ గోస్పాడును వైసిపి పెట్టని కోటగా ప్రచారం చేయడమే. నంద్యాల ఎన్నికలో తొలినుంచి వైసిసి ధీమాగా ఉన్నది గోస్పాడు మండలం గురించే. ఈ మండలంలో పూర్తి మెజారిటీ వస్తుందని, దానితో నంద్యాల టవున్లో పోయే వోట్ల గండి పూడుతుందని వైసిపి నేతలు చెబుతూ వచ్చారు. అందుకే వాళ్లు గోస్పాడును ఒక మంత్రంగా జపించారు. అయితే, గోస్పాడు వైసిపి అంచనాలను తారుమారు చేసింది. రాజకీయాల్లో పెట్టని కోటలేవీ ఉండవని, కోటలుగా బీటలువారుతాయని గోస్పాడు రుజువు చేసింది.

ఈ మండలంలో గోస్పాడు, యాళ్లూరు, ఎం.కృష్ణాపురం, దీబగుంట్ల, పార్వతీపురం, జిల్లేళ్ల, జూలేపల్లి, చింతకుంట్ల, పసురపాడు, తేళ్లపురి గ్రామాలున్నాయి.  మొన్న ఎన్నికల్లో మండలంలో మొత్తం 28,844 ఓట్లకు గానూ 26,193 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపు 90శాతానికి పైగా ఓటర్లు బ్యాలెట్ పట్టారు. ఇదంతా వైసిపికోసమే నని అంతా అనుకున్నారు. వీళ్లలో మెజారిటీ ఓటర్లు టిడిపికివోటేశారని ఫలితాలు రుజువు చేశాయి. వైసిపికి షాక్ ఇచ్చారు.   ఈ మండలంలో టిడిపికి  వైసిపి కంటే ఎక్కవ ఓట్ల రావడం జిల్లాలో పెద్ద చర్చనీయాంశమయింది. టిడిపి ఇపుడు ఎగిరి గంతేస్తా ఉంది. 


గోస్పాడు గురించి


గోస్పాడు పెద్ద పల్లె. జనాభా 4500. రాష్ట్ర రహదారి 23 మీద నంద్యాల-కొవెలకుంట్ల మధ్య ఉంటుంది. ఈ పేరు మీదే ఉండే మండలానికి హెడ్ క్వార్టర్స్ ఈ వూరు.  2009 ముందు వరకు గోస్పాడు మండలం ఆళ్లగడ్డ నియోకవర్గంలో ఉండేది. నియోజకవర్గ పునర్విభజనలో ఈ మండలాన్ని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కలిపారు. 2014 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి వైసిపి తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో భూమాకు ఒక్క గోస్పాడు మండలంలోనూ 5వేల పై చిలుకు మెజార్టీ వచ్చింది. ఇదే  వైసిపి ధీమాకు కారణమయింది.ఇవన్నీ భూమా వోట్లు కాదు, జగన్ వోట్లనుకుఅన్నారు. గోస్పాడు కోట అనుకున్నారు. తర్వాత భూమా టిడిపిలో చేరడం, ఆయన మృతి, ఉప ఎన్నిక రావడం జరిగింది. వైసిపి పాత లెక్కలనే నమ్ముకుంది. భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరినా ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదనే ధీమాతో ఉంది. దీనికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒక సర్వే చేసి ధృవీకరణ సర్టిఫికేట్ కూడా ఇచ్చారట. ఎపుడయితే, వైసిపి గోస్పాడు మీద ఆశపెట్టుకుందో, అపుడే తెలుగుదేశం గోస్పాడు మీద కన్నేసింది. గండి కొట్టాలని నిర్ణయించింది.
 
ఉప ఎన్నికల సమయంలో గంగుల ప్రతాప్ రెడ్డి టిడిపిలో చేర్చుకుంది. అక్కడ     గంగుల కుటుంబానికి మంచి పట్టుఉంది. మూడు పర్యాయాలు ఎమ్మేల్యేగా, లోక్ సభ, రాజ్య సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఆయనది. అపుడు గోస్పాడు ఆయనకు మద్దతునిచ్చింది. తొలుత గంగులతో  జగన్ మాట్లాడింది గోస్పాడు వ్యవూంలో భాగంగానే.  బేరం కుదరలేదు. తర్వాత  శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరాడు.  ఆయనకు టికెట్  ఖరారు చేశారు.


గోస్పాడు, దీనగుంట్ల, యాలూరు, జిల్లెల్ల, సాంబవరం, పసులపాడు, చింతకుంట, నంద్యాల మండలంలోని కానాల, రైతు నగర్ తదితర ప్రాంతాల్లో గుంగుల వర్గానికి బంధుగుణంతోపాటు ప్రత్యేక వర్గం ఉంది.ఆయనకు టికెట్ ఇవ్వక పోవడంతో ఈ వర్గం టిడిపి వైపు మొగ్గింది. దీనికి తోడు ముఖ్యమంత్రి తన వ్యవూంలో భాగంగా తన పని తాను చేసేశారు. ఇవన్నీ కలగలసి గోస్పాడు మండంలో టిడిపికి 1858 ఓట్ల ఆధిక్యం తెచ్చాయి. ఇక్కడ టిడిపి-10,521 ఓట్లు పడితే వైసిపికి 8,663 ఓట్లు పోలయ్యాయి.

 

 

మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !