నంబ‌ర్ వ‌న్ ర్యాంకే ల‌క్ష్యం

First Published Aug 29, 2017, 1:03 PM IST
Highlights
  • రజతం గెలవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
  • గ‌తంలో క‌న్న త‌న ఆట మెరుగైంద‌న్నారు.
  • ప్ర‌తి పాయింట్ కోసం శ్ర‌మించాన‌ని సింధు తెలిపారు.

వరల్డ్ బ్యాడ్మింటన్ లో నంబ‌ర్ వ‌న్ ర్యాంకే ల‌క్ష్యంగా కృషి చేస్తాన‌న్నారు పీవీ సింధు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో ఈ సారి మెడ‌ల్ క‌ల‌ర్ చేంజ్ చెద్దామ‌ని అనుకున్నా తృటిలో త‌ప్పిపోయింద‌ని అన్నారు (బంగారం కోసం ప్రయత్నం పై). రజతం గెలవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ముగిసిన తరువాత కోచ్ గోపీ చంద్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్న సింధు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

గ‌తంలో క‌న్న త‌న ఆట మెరుగైంద‌న్నారు సింధు, అందుకు కార‌ణం కోచ్, తల్లిదండ్రుల సహకారంతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో జరిగిన ఫైనల్ పోరు చాలా కఠినంగా సాగిందన్నారు, ప్ర‌తి పాయింట్ కోసం శ్ర‌మించాన‌ని సింధు పేర్కొన్నారు. చివర్లో చాలా ఎనర్జిగా ప్ర‌త్య‌ర్ధిని ఎదుర్కోన్నాని ఆమె తెలిపారు, రాబోయో టోర్న‌మేంట్స్  కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డుతాన‌ని పీవీ సింధు పేర్కొన్నారు.

అనంత‌రం కోచ్ గోపీచంద్ కూడా మాట్లాడారు, సింధు ప్రదర్శన చాలా బాగుందన్నారు. ఫైనల్ మ్యాచ్ సుదీర్ఘంగా కొనసాగిందన్నారు. ఇలాంటి గేమ్స్ కి ఫిట్నెస్ చాలా అవసరమ‌ని తెలిపారు. సింధు ప్రదర్శన మన క్రీడాకారులకు ప్రోత్స‌హాకంగా ప‌ని చేస్తుంద‌న్నారు. టోర్నమెంట్ లో భార‌త్ కి రెండు మెడల్స్ రావాటం గర్వంగా ఉంద‌ని గోపీచంద్ తెలిపారు.

 

 

మరిన్ని వార్తాల కోసం కింద క్లిక్ చేయండి

 

click me!