కనబడితే చాలు కండువా వేస్తున్నాడట ఆ మంత్రి (వీడియో)

Published : Sep 16, 2017, 03:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కనబడితే చాలు కండువా వేస్తున్నాడట  ఆ మంత్రి (వీడియో)

సారాంశం

వినతి పత్రం ఇచ్చేందుకు వెళితే, మంత్రి ఈ పనిచేశాడని వాపోతున్నారు బత్తులపల్లి గ్రామస్థులు

 

 

ఇంటింటికి తెలుగుదేశం యాత్ర సందర్భంగా వ్యవసాయ మంత్రి చంద్రమోహన్ రెడ్డి జాక్ పాట్ కొట్టాడనుకున్నారు. ఎందుకంటే, ఒక వూరోళ్లంతా వైసిపి వదిలేసి తెలుగుదేశం చేరారట. ఆయన వారందరికి పసుపు కండువా కప్పి వాళ్లంతా  జగన్ ను వదిలేసి  టిడిపిలోకి వచ్చారని ప్రకటించారు. అయితే,  ఇది తెలుసుకున్న గ్రామస్థులు  ఇదేందిస్వామి ఇట్ల చెప్తివి, మేమంతా వైసిపిలోనే ఉన్నామని ప్రకటించారు. తెలుగుదేశంలో చేరినట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించడం తప్పని  పొదలకూరు మండలం బత్తులపల్లి గ్రామస్తులు చెబుతున్నారు.

 

 తాము వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టిలోనే కొనసాగుతామని తెలియజేశారు. సాగునీరు అందివ్వాలని  వినతిపత్రంతో వెళితే కండువాలు కప్పారని, తాము తెలుగుదేశం ప్రకటించారని బత్తులపల్లి గ్రామస్తులు ఇపుడు చెబుతున్నారు. చంద్రమోహన్ రెడ్డి కి ఇలాంటిదే అలవాటే నని,గతంలో కూడా ఏదో పని వచ్చినవారి మీద కండువ వేసి, పార్టీమారారని ప్రకటించిన సందర్భాలున్నాయని, 24 గంటలు కాకముందే వాళ్లు మంత్రి మాటను ఖండించారని  నెల్లూరు జిల్లాకు చెందిన వెసిపి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డిఅంటున్నారు. ఈ కధేంటో వీడియో చూడండి.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !