
రాబడి వెేటలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్య దుకాణాలకు చెడా మడా లెసెన్స్ లిస్తూ ఉంది. జనావాసాలు, పాఠశాలల పరిసరాలనే తేడా లేకుండా మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతులు మంజూరు చేస్తూ ఉంది. దీనికి రాష్ట్రంలోని పలుప్రాంతాలలో వ్యతిరేకత వస్తూ ఉంది. ముఖ్యంగా రాజధాని అమరావతి పరిసరాలలో మహిళలు ఈ షాపులకు వ్యతిరేకంగా ధర్నాలుచేయడం చూస్తున్నాం.
ఈరోజు విజయవాడల ో విద్యార్థులు తమ స్కూలుసమీపంలో ఏర్పాటుచేసిన వైన్ షాపు ఎత్తేయండని రోడ్డె క్కారు.
నగరం భవానిపురం-స్వాతి థియేటర్ రోడ్డు కూడలి వద్ద పలు విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థల మధ్య నూతనంగా మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. ఆ మద్యం దుకాణాన్ని తొలగించాలని పలు విద్యా సంస్థల విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు.