ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక తొలిసారి తిరుమల వచ్చిన వెంకయ్య

Published : Aug 06, 2017, 08:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక తొలిసారి తిరుమల వచ్చిన వెంకయ్య

సారాంశం

ఉపరాష్ట్రపతిగా ఎన్నికయిన వెంకయ్యనాయుడు రేపు ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఎన్నికయ్యాక ఆయన తొలిసారి తిరుమల వచ్చారు.

భారత ఉప రాష్ట్రపతి గా ఎన్నికైన  ఎం.వెంకయ్య నాయుడుఈ రోజు సాయంత్రం 7:20 గంటలకు ప్రత్యేక విమానంలో లో బెంగళూరు నుండి తిరుపతి-రేణిగుంట విమానాశ్రయంలో లో దిగారు . ఆయన తిరుమల శ్రీవారిని సందర్శించుకునేందుకు  వచ్చారు. ఎన్నికయ్యాక ఇదే ఆయన తొలి ఆంధ్రప్రదేశ్ పర్యటన.


చిత్తూరు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, జెసి గిరీషా, మునిసిపల్ కమీషనర్ హరికిరణ్, అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహ యాదవ్, సబ్ కలెక్టర్లతో నిశాంత్ కుమార్, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ టీటీడీ చైర్మన్, మెంబర్ భానుప్రకాష్ తదితరులు రేణిగుంట ఏయిర్పోర్టు లో ఘనంగా స్వాగతం పలికారు.

రేణిగుంట విమానాశ్రయం నుండి నేరుగా ప్రత్యేక కాన్వాయ్ లో ఆయన  తిరుమల వెళ్లారు.

రేపు ఉదయం తిరుమల లో శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం తిరుపతి లో ఉదయం 11 గంటల నుండి 12:30 గంటల వరకు స్విమ్స్ ఆస్పత్రి , పద్మావతి మెడికల్ కాలేజ్ లో  కార్యక్రమాలలో పాల్గొంటారు.  

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !