11లక్షల పాన్ కార్డులు డీ యాక్టివేట్... అందులో మీదీ ఉందా..?

First Published Aug 6, 2017, 5:55 PM IST
Highlights
  • ప్రభుత్వం 11లక్షల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసింది.
  • అందులో మీ పాన్ కూడా ఉందా చెక్ చేసుకోండి

 

మీరు చదివింది నిజమే.. ప్రభుత్వం 11లక్షల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. అందులో కొన్నింటిని డిలీట్ కూడా చేసింది. మరి ప్రభుత్వం డీయాక్టివేట్ చేసిన పాన్ కార్డుల్లో మీది కూడా ఉందా.. ప్రతి భారత పౌరుడు తమ ఆధార్ కార్డును.. పాన్ తో అనుసుంధానం చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. దీనికి ఆగస్టు 31వ తేదీ ఆఖరు తేదీ. కాగా.. చట్టవ్యతిరేక పరమైన పలు  పాన్ కార్డలను ప్రభుత్వం డీయాక్టివేట్ చేసింది.   వీటిలో మీ పాన్ కూడా ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఈ విధంగా చేయండి.

ముందుగా ఐటీ డిపార్ట్ మెంట్ ఇ- ఫిల్లింగ్ వెబ్ సైట్ (incometaxindiaefiling.gov.in.) ని సందర్శించండి.

అందులో 'Know Your Pan' బటన్ ని క్లిక్ చేయండి. ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలు జాగ్రత్తగా నింపండి. ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ ఆ వివరాలు నింపాలి. అనంతరం సబ్ మిట్ చేయాలి. అప్పుడు మీ  ఫోన్ నెంబర్ కి వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వాలిడేట్ బటన్ పై క్లిక్ చేయాలి. తర్వాతి పేజీలో అడిగిన  సమాచారాన్ని కూడా అందజేయాలి. ఇదంతా చేసిన తర్వాత.. మీ పాన్ కనుక డీ యాక్టివేట్ కాకపోయి ఉంటే ‘యాక్టివ్’ అని కనిపిస్తుంది. ఈ విధంగా మీ పాన్  యాక్టివ్ గా ఉందో లేదో తెలుసుకోవచ్చు.

click me!