బీఎస్ఎన్ఎల్ రాఖీ కానుక అదిరింది..!

Published : Aug 06, 2017, 06:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
బీఎస్ఎన్ఎల్ రాఖీ కానుక అదిరింది..!

సారాంశం

జియో తాకిడిని తట్టుకునేందుకు అన్ని టెలికాం సంస్థలు తమ వంతు కృషి బాగానే చేస్తున్నాయి ‘రాఖీ పే సౌగత్’ అంటు రాఖీ బహుమతి పేరిట ఈ ఆఫర్ ని తీసుకువచ్చింది. 

 

జియో తాకిడిని తట్టుకునేందుకు అన్ని టెలికాం సంస్థలు తమ వంతు కృషి బాగానే చేస్తున్నాయి.ఇందులో భాగంగానే బీఎస్ఎన్ఎల్

( భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) రక్షా బంధన్ ని పురస్కరించుకొని  వినూత్న ఆఫర్ ని వినియోగదారుల  ముందుకు తీసుకు వచ్చింది. ‘రాఖీ పే సౌగత్’ అంటు రాఖీ బహుమతి పేరిట ఈ ఆఫర్ ని తీసుకువచ్చింది.  ఈ ఆఫర్ వర్తించాలటే.. రూ.74తో రీఛార్జ్ చేయించుకోవాలి. అలా చేయించుకుంటే.. 1జీబీ డేటా, బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ కు ఉచితంగా అన్ లిమిటెడ్ నెట్  కాల్స్ చేసుకోవచ్చు. అవి కూడా ఎస్టీడీ.. అండ్ లోకల్ కాల్స్ రెండూ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక ట్వట్టర్ ద్వారా తెలియజేసింది.

ఆగస్టు 3వ తేదీనుం చే ఈ ఆఫర్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ‘ బంధాలను  దూరం ఎప్పటికీ వేరు చేయలేదు.. అన్ లిమిటెడ్  బిఎస్ ఎన్ ఎల్ కాల్స్.. చేసుకోండి ఈ రాఖీ పే సౌగత్ తో’ అంటూ

కంపెనీ ట్విట్టర్ లో పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !