
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి సీనియర్ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన రెండు సెట్ల నామినేషన్ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. తొలి సెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేశారు. రెండో సెట్‌పై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతకం చేశారు. బిజెపి, తెలుగు దేశం పార్టీ, తెలంగాణా రాష్ట్రసమితి ఎంపిలతో పాటు పలువురు ఎన్డీయే పక్షాల ఎంపీలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ సహా పలువురు ఎంపీలు, వెంకయ్య నాయుడు వెంబడి అన్నారు.
ఆగస్టు 5న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతంది. ఆయన యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీతో తలపడనున్నారు.