విజయవాడలో టిటిడి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు

Published : Jun 21, 2017, 08:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
విజయవాడలో టిటిడి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు

సారాంశం

టిటిడి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో జులై 2 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు జరుగనున్నాయి. జులై 2, 3వ తేదీల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలతో ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు.

టిటిడి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో జులై 2 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు జరుగనున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఇందుకోసం విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుచేసి ఉదయం 6.30 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించి రాత్రి 9.00 గంటలకు ఏకాంత సేవ వరకు కైంకర్యాలు నిర్వహిస్తారు. రోజువారీ కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి. ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు అర్చన, ఉదయం 8.45 నుంచి 9 గంటల వరకు నివేదన, శాత్తుమొర, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక సేవ, ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు రెండో నివేదన చేపడతారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5.45 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.15 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.15 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు.

జులై 2, 3వ తేదీల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలతో ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు. ప్రత్యేక సేవల్లో భాగంగా జులై 4న అష్టదళ పాదపద్మారాధన, జులై 5న సహస్రకలశాభిషేకం, జులై 6న తిరుప్పావడ, జులై 7న అభిషేకం, జులై 8న వసంతోత్సవం, శ్రీనివాస కల్యాణం, జులై 9న పుష్పయాగం నిర్వహిస్తారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !