
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువకులను మోసం చేసిన కృష్ణాజిల్లా నందిగామ చెందిన ఒక ముఠా కు జైలు శిక్ష పడింది.
అయిదుగురు వ్యక్తులు నుండి ఒక్కోక్కరి వద్ద రూ1.5 లక్షలు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేసిన ముగ్గురుకు మూడేళ్ళ జైలు శిక్షతో పాటు బాధితుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలంటూ నందిగామ అడిషనల్ జుడిషీయల్ ఫస్ట్ క్లాసు మేజిస్ట్రేట్ జీ ప్రభాకరరావు తీర్పు ఇచ్చారు.
2008లో నందిగామ కు చెందిన కొండ్రు బాబు మిత్రుడు నల్గొండ జిల్లా మెళ్ళచెర్వు కు చెందిన సగ్గుర్తి సర్జనరావుతో కలిసి హైదరాబాద్ కు చెందిన మీషనరి నిర్వాహకులు జాన్ పాల్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దేశమ్మీద పడ్డారు.
వీరి వలలో మెళ్ళచెర్వు కు చెందిన 5 గురు పడ్డారు. ఒకొక్కరి నుండి రూ1.5 లక్షలు వసూలు చేశారు. నెలలు గడిచిపోయిన ఉద్యోగాలు ఇప్పించక పోవడంతో బాధితులు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.
విచారణ అనంతరం నందిగామ అడిషనల్ జుడిషీయల్ ఫస్ట్ క్లాసు మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు.