
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై అక్కడి అధికార టీడీపీ పార్టీ కూడా పోరాడకుండా చేతులెత్తేసిన వేళ తెలంగాణ ఎంపీలు ఈ అంశంపై రోజు రాజ్యసభను ఈ రోజు కుదిపేశారు.
రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత కేవీపీ ఇచ్చిన నోటీసుపై చర్చ సందర్భంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత, ఎంపీల రాపోలు ఆనంద భాస్కర్, టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు ( టీఆర్ఎస్) చర్చలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాపోలు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం గత కొంత కాలంలో ఆంధ్రాలో ఆందోళనలు జరుగుతున్నాయని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇదే చర్చలో పాల్గొన్న కేకే కూడా ఏపీ కి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఎన్డీసీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా విధివిధానాలపై చర్చ జరపాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు
ఎన్డీసీ ఆమోదం లేదని మంత్రి చెప్పడం సరికాదన్నారు. మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ దీనిపై రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ చైర్మన్ ను డిమాండ్ చేశారు. నాడు ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.
ఆనంద భాస్కర్ ఏమన్నాడో చూడండి