
ఇన్నాళ్లు అసెంబ్లీలలో కొట్టుకోవడం, తిట్టుకోవడం మాత్రమే చూశాం. ఈ త్రిపుర శాసనసభ కాస్త వెరైటీ. అసెంబ్లీని కాస్త రన్నింగ్ ట్రాక్ గా మార్చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బర్మన్ మంగళవారం అసెంబ్లీకి హాజరయ్యారు. ఎందుకో మరి ఉన్నట్టుండి స్పీకర్ బల్లపై ఉన్న గదను తీసుకొని అసెంబ్లీలో పరుగులు పెట్టారు.
కొందరు ఆయన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా తప్పించుకుని గదతో సహా బయటకు పారిపోయారు.
అనంతరం అసెంబ్లీ సిబ్బంది ఆయన నుంచి గదను తీసుకొని స్పీకర్‌కు అప్పగించారు.
గతంలోనూ స్పీకర్ సమక్షంలో ఉండే ఈ గదను మూడు సార్లు సభ్యులు బయటకు తీసుకెళ్లారట.