ఈమె పాకిస్తాన్ లో ఇపుడు హాట్ న్యూస్

First Published Dec 20, 2016, 10:55 AM IST
Highlights

ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మర్యామ్  పాకిస్తాన్ లో రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతూ ఉందని పాక్ సోషల్ మీడియా కోడై కూస్తా ఉంది.

ఈ పోటోలో ఉన్న ది మామూలు మహిళ  కాదు. ఇపుడు  పాకిస్తాన్ లో హాట్ న్యూస్.  పేరు మర్యామ్ నవాజ్ షరీఫ్(38). పాక్ ప్రధాని నవాజ్ షరీష్ కూతరు. దేశంలో ఎక్స్ ట్రా కాన్స్ స్టిట్యూషనల్ అధారిటీ ( రాజ్యాంగేతర శక్తి)  అయి అక్కవ వార్త ల్లోకెక్కింది. నవాజ్ వారసురాలనే పేరు తెచ్చుకుందపుడే. ఆమె ఇపుడు ఏషియాలోఉదయిస్తున్న మరొక మహిళా ప్రధాని అనిచెబుతున్నారు. మహిళా ప్రధాని పాకిస్తాన్ కు కొత్త కాకపోయినా, బేనజీర్ భుట్టో   ప్రధాని అయినా, అమె రాజకీయ జీవితం తీవ్రవాదుల బాంబు దాడతో మధ్యలో ముగిసింది.

 

పలకడానికి కొంచెం ఇబ్బంది  పెట్టే  ఈ ఎక్స్ ట్రా కాన్స్ స్టిట్యూషనల్ అధారిటీ అనే మాట ఒకపుడు భారతరాజకీయాల్లో కూడా హల్ చల్ చేసింది.  ప్రధాని కొడుకో, ముఖ్యమంత్రి కోడుకో ఏ పదవి లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని శాసించే టపుడు అతగాడిని ఎక్స్ ట్రా కాన్స్ స్టిట్యూషనల్ పవర్ సెంటర్ అనే దూషించే వారు. అయితే,  అవి కొడుకులను ఎమ్మెల్యేలు, పిలు చేయాలని మన నేతలు భావించని సత్తెకాలపు రోజులు.

 

ఇపుడు ఈపదం రాజకీయ భాష నుంచి మాయమయింది. ఎందుకంటే, చాలా మంది నేతల కొడుకులు నేతలయిపోయారు. ఇంటికిద్దరేసి ముగ్గురేసి ఎమ్మెల్లేలు, ఎంపిలు, మంత్రులు ఉండే రోజులివి. ఎక్స్ ట్రా కాన్స్ స్టిట్యూషనల్ పవరయి చెడ్డ పేరు తెచ్చుకోనవసరం లేదు.

 

 

మళ్లీ మర్యాం దగ్గర  కొస్తే, ఇపుడు పాక్  సోషల్ మీడియా ఆమె ఎక్స్ ట్రా కాన్స్ స్టిట్యూషనల్ అధారిటీ అయిపోయిందని కోడై కూస్తోంది. దీనికి కారణం-

 

చైనా ఇంటర్నేషనల్ డిపార్ట్ మెంట్ ఉప మంత్రి జెంగ్ షియావోసంగ్,  ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొనడం.చైనా కూడా ఆమెకు ఎన లేని ప్రాముఖ్యం ఇస్తూ ఉండటం.  ఏమో,  చైనా వాళ్లేమయినా ఆమెనే నవాజ్ వారసులి చూస్తున్నారేమో.

 

జెంగ్ షియావోసంగ్ నేతృత్వంలో  ఒక చైనా బృందం పాకిస్తాన్ నిన్నప్రధాని నవాజ్ షరీష్ ను కలిసింది.

 

 

ఇరువురు ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుకున్నారు. పాకిస్తాన్, చైనా ఎకనమిక్ కారిడార్ గురించి వారు ప్రధానంగా చర్చించుకున్నారు.

 

రెండు దేశాల మధ్య స్నేహం ఒక బలమయిన ఆర్ధిక బంధంగా మారిందని ప్రధాని నవాజ్ షరీష్ చెప్పారు. ఇక్కడ వారు సమావేశం కావడం, అందులో ఏమిచర్చించారనే దానికంటే పాకిస్తాన్ మీడియా అసక్తి కనబర్చిన విషయం మరొకటుంది.

 

అది ఈ ఉన్నత స్థాయి  అధికారిక సమావేశంలో నవాజ్ షరీఫ్ కూతురు మర్యామ్ నవాజ్ కూడా పాల్గొనడం. చైనా  బందం కోరిక మేరకే ఆమె ఈ సమావేశంలో పాల్గొన్నారని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నారు. అంతేకాదు, ఒకసారి చైనా సందర్శించాలని కూడా చైనా బృందం మర్యామ్ ను కోరిందట.

 

మర్యామ్ ఇపుడు  9/11పోస్ట్ రాడికలైజేషన్ ఇన్ పాకిస్తాన్ అనే అంశం మీద  పిహెచ్ డి చేస్తున్నారు. అరబిక్ తో సహా నాలుగు భాషలు అనర్గళంగా  మాట్లాడగలుగుతారు. కుటంబ ట్రస్టు సేవా కార్యక్రమాలు పర్యవేక్షించడంతో పాటు, సోషల్ మీడియా తండ్రి తరపున ప్రచారం సాగిస్తూ ఉంటారు. నవాజ్ వారసులు కొడుకులు కాదు,కూతురే నని  పాకిస్తాన్లో అంతా అనుకుంటున్నారు. 

పూర్వం  ఇందిరాగాంధీని గురించి ప్రశంసించే రోజులలో  ఆమె ఉగ్గుపాలతోనే రాజకీయాలు నేర్చుకుందని వినేవాళ్లం. తండ్రి నెహ్రూ జరిపే రాజకీయ సమావేశాలలో

 

 

 

click me!