01 మార్చి, 2018 గురువారం మీ రాశిఫలాలు

Published : Mar 01, 2018, 08:28 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
01 మార్చి, 2018 గురువారం మీ రాశిఫలాలు

సారాంశం

ఈ రోజురాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం: డబ్బు విషయంలో సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరుగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జా గ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు. పెట్టుబడులకు, భూ, గృహ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.

వృషభం

వృషభం: ఆరోగ్యంసామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగత్త అవసరం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం.

మిథునం

మిథునం : ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజ యం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడం మంచిది.

కర్కాటకం

కర్కాటకం : పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకు లు రావటం కానీ జరుగవచ్చ. ఇది తాత్కాలికమే కాబట్టి పట్టు వదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గుర య్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు

సింహం

సింహం : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త విం టా రు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. ప్రమోషన్ లేదా బదిలీకి సంబంధించిన పనులు ఒక కొలిక్కి వస్తాయి.

కన్య

కన్య : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధ సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

తుల

తుల :ఈ రోజు మీకు ఆనందంగా, లాభదాయకంగా ఉం టుం ది. అనుకోని మిత్రులను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం

వృశ్చికం :వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతు న్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వలన ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రుల తో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.

మకరం

మకరం :మీ సహోద్యోగులతో, పైఅధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించటం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమై చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది కాబట్టి జాగత్త అవసరం. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం

కుంభం : మీ దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుంది. వివాదాలు సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు శుభకార్యంలో పాల్గొంటారు. వ్యాపారస్థులు పెట్టుబడు లు పెట్టడం కానీ, నూతన వ్యా పార ఒప్పందాలు ఏర్పరచుకోవటం కానీ చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

మీనం

మీనం :మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వాయిదా పడుతున్న పనులు ఎలాగైనా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉంటారు. అదే పట్టుదలతో వాటిని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ మాట నెగ్గుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu