భారీగా తగ్గిన బంగారం ధర

First Published Feb 28, 2018, 4:52 PM IST
Highlights
  • భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధర భారీగా పడిపోయింది. వరుసగా నాలుగు రోజులపాటు పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గింది. రూ.460లు తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.31,390కి చేరింది. డాలరు విలువ పెరగడంతో అంతర్జాతీయంగా లోహ వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టాయని, వీటికి తోడు స్థానిక బంగారు ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ కూడా కాస్త తగ్గడంతో పసిడి ధర తగ్గినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

వెండి ధర కూడా కాస్త తగ్గింది. రూ.250 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.39,300కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో వెండి ధర తగ్గినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయంగా బంగారం ధర 0.07శాతం తగ్గడంతో ఔన్సు 1,316.80 డాలర్లు పలికింది. వెండి 0.37శాతం తగ్గడంతో ఔన్సు 16.32 డాలర్లు పలికింది.

 

click me!