ఏప్రిల్ 05, 2018 గురువారం మీ రాశిఫలాలు

Published : Apr 05, 2018, 09:25 AM IST
ఏప్రిల్ 05, 2018 గురువారం మీ రాశిఫలాలు

సారాంశం

ధనలాభం ఉంటుంది

మేషం

మేషం : ప్రతి పనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానానికి గురవటం లేదా వివాదాల్లో ఇరుక్కోవటం జరుగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసిక ైస్థెర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది.

వృషభం

వృషభం : మీ మిత్రులను కలుసుకుంటారు. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

మిథునం

మిథునం : మిథునం : ఉద్యోగ , ప్రయాణం విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణ యం తీసుకుంటారు. వ్యాపార ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం మం చిది కాదు. పెట్టుబడులకు అనుకూలం కాదు.

కర్కాటకం

కర్కాటకం : మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికం గా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక వ్యవహారాలకు అనుకూలం కాదు. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం

సింహం

సింహం : ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఉదర సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణ మవుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

కన్య

కన్య : మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరుగవచ్చు. ఉద్యోగం, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి సాయాన్ని పొందుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

తుల

తుల : ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్తగా ఉండటం మం చిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బం ది కల్గించే అవకాశ ముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది.

వృశ్చికం

వృశ్చికం : మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకం గా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశముంది. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

ధనుస్సు :

ధనుస్సు : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి.

మకరం

మకరం :ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పను లు సులువుగా పూర్తి చేయగలుగుతారు.

కుంభం

కుంభం :ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మీనం

మీనం : ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu