30జనవరి మంగళవారం 2018..మీ రాశి ఫలాలు

Published : Jan 30, 2018, 08:12 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
30జనవరి మంగళవారం 2018..మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం : ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతీ సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం

వృషభం

వృషభం : మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవడం కానీ జరుగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల్లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం..

మిథునం

మిథునం : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

కర్కాటకం

కర్కాటకం : మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

సింహం

సింహం : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కాని చేయాల్సి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

కన్య

కన్య : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావడం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందడం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

తుల

తుల : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మితులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. పయాణంలో జాగ్రత్త అవసరం.

మకరం

మకరం : ఈ రోజు మీ జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయి. స్నేహితులతో కలిసి వినోదయాత చేస్తారు. మీ జీవిత భాగస్వామి సహాయం అందుకుంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. నివాస స్థలంలో మార్పు ఉంటుంది.

కుంభం :

కుంభం : ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నీటి కారణంగా అనారోగ్యం పాలయ్యే అవకాశముంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలుంటాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికి తగినంత డబ్బు సమయానికి అందుతుంది.

మీనం

మీనం : చేపట్టిన పనులు అధిక శ్రమతో పూర్తి చేయగలుగుతారు. సాయం చేస్తా అని చెప్పిన వారు సమయానికి మాటమార్చే అవకాశముంటుంది. దాని కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల సమయం కాదు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu