హైదరాబాద్ లో లూలూ గ్రూప్ భారీ మాల్

First Published Jan 29, 2018, 6:16 PM IST
Highlights

లూలూ పెట్టుబడులతో 5000 మందికి ఉద్యోగావకాశాలు

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన ప్రభావం బాగానే ఉంది. విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూలు కడుతున్నాయి. ఇటీవల కేటీఆర్.. దుబాయి, దావోస్, జపాన్ లలో పర్యటించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయమే.. ఆయనే విదేశీ పర్యటన ముగించుకొని నగరంలోకి అడుగుపెట్టారు. అలా హైదరాబాద్ లో అడుగుపెట్టారో లేదో.. ఆయన పర్యటన పుణ్యమాని.. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపించడం మొదలుపెట్టాయి.

దుబాయికి చెందిన లాలు గ్రూప్స్ కంపెనీ.. తెలంగాణ ప్రభుత్వంతో మూడు ఒప్పందాలు చేసుకుంది. 400మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.2,500కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో 18 లక్షల చదరపు అడుగుల్లో భారీ షాపింగ్ మాల్‌తోపాటు, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, కూరగాయల ఎగుమతుల యూనిట్లను లూలూ స్థాపిస్తుంది. వీటిద్వారా దాదాపు ఆరువేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరోవైపు డాక్టర్ బీఆర్ షెట్టి గ్రూప్స్ తెలంగాణలో మూడు ప్రాజెక్టుల నిర్మా ణానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర ఒప్పందాలను కుదుర్చుకుంది.

రానున్న మూడు నెలల్లో.. వీటికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకున్నందుకు తమకు చాలా సంతోషంగా ఉందని లాలూ గ్రూప్స్  ఛైర్మన్ యూసూఫ్ అలీ తెలిపారు. లాలూ గ్రూప్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని కేటీఆర్ కూడా అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లూలూ సంస్థ సీఈవో సైఫీ రూపావాలా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్రాఫ్ అలీ, సీవోవో సలీమ్, ఓమన్ ఇండియా డైరెక్టర్ అనంత్ ఏవీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లూలూ- తెలంగాణ ప్రభుత్వం ఒప్పందంలో ని ముఖ్యాంశాలు..

* 400మిలియన్ డాలర్ల పెట్టుబడులు( రూ.2,500కోట్లు)

*18లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్ నగరంలో షాపింగ్ మాల్

*రంగారెడ్డి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్

*మెదక్ జిల్లాలో కూరగాయలు, పండ్లు ప్రాసెసింగ్ యూనిట్

*మూడునెలల్లో వీటికి శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

* 5వేల మందికిపైగా ఉపాధి లభించే అవకాశం

తెలంగాణలో మంచి అవకాశాలున్నాయి: లూలూ చైర్మన్ యూసుఫ్ అలీ

పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సమకూరుస్తున్న వనరులపట్ల, ఆవకాశాల పట్ల  గ్రూపు చైర్మన్ యూసుఫ్ అలీ  సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను ఆయన కొనియాడారు.   ఈ విషయం మీద మాట్లాడుతూ భారత్‌లో తమ కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని , ఇది హర్షదాయకమని అన్నారు.  ‘కొత్త రాష్ట్రమైనా తెలంగాణ ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం, స్పందన లభిస్తున్నది,’ అని ఆయన కితాబిచ్చారు. తెలంగాణలో వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలున్నాయని అంటూ  తమకు భూమిని అప్పగించడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించిందని, మూడునెలల్లో పనులను ప్రారంభిస్తామని ఆయన అన్నారు.  

click me!