తగ్గిన బంగారం ధర

First Published 29, Jan 2018, 5:06 PM IST
Highlights

పదిగ్రాముల బంగారం ధర రూ.31,120

కేజీ వెండి ధర రూ.40,450

బంగారం ధర కాస్త తగ్గింది. నేటి( సోమవారం) మార్కెట్ లో రూ.80తగ్గి పది గ్రాముల బంగారం ధర రూ.31,120కి చేరింది. స్థానిక బంగారు నగల వ్యాపారుల దగ్గర నుంచి డిమాండ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో.. బంగారం ధర కూడా తగ్గిందని బులియన్ వర్గాలు తెలిపాయి. ఈరోజు వెండి కూడా బంగారం బాటేపట్టింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. రూ.200 తగ్గి కేజీ వెండి ధర రూ.40,450కి చేరింది.  పరిశ్రమలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ మందగించడంతో ధర కూడా తగ్గుముఖం పట్టిందని బులియన్ వర్గాలు తెలిపాయి.

అంతర్జాతీయ మార్కెట్ లో 0.20 తగ్గి ఔన్సు పసిడి ధర 1,346.60డాలర్లకు చేరింది. అదేవిధంగా 0.23శాతం తగ్గి ఔన్సు వెండి ధర 17.34 డాలర్లకు చేరింది. దేశరాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.31,120గా ఉండగా.. 99.5శాతం స్వచ్ఛతగల పసిడి ధఱ రూ.30,970గా ఉంది

Last Updated 25, Mar 2018, 11:55 PM IST