24జనవరి బుధవారం 2018..మీ రాశీ ఫలాలు

Published : Jan 24, 2018, 08:09 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
24జనవరి బుధవారం 2018..మీ రాశీ ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగ స్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉం డాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

వృషభం

ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవస రం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూ సుకొండి. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం.

మిథునం

ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

కర్కాటకం

ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్ర యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం.

సింహం

ఈ రోజు మీరు దూర ప్రదేశం నుంచి వచ్చిన మితులను కానీ, చిన్ననాటి మితులను కానీ కలుసుకుంటారు. విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేతదర్శనం చేసుకుంటారు.

కన్య

ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం.

తుల

ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ స భ్యులతో కాని ఎక్కువ సమయం గడుపుతారు. కొత్త వస్తువులు కానీ, దుస్తులు కానీ కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు నూతన లావాదేవీలు చేస్తా రు. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు.

వృశ్చికం

వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్థులకు రావలసిన బకాయిలు వసూలవుతాయి.

ధనుస్సు

ఈ రోజు పూర్తి కావలసిన పనులు చివరి క్షణంలో వాయి దా పడతాయి. మానసిక ఆందోళనకు గురవుతారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. సంతానం లేదా ఆరోగ్యం కారణంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. వృత్తిలో మీకు అనుకూలంగా రావలసిన నిర్ణయం వేరే వారికి అనుకూలంగా వస్తుంది.

మకరం

కడుపు, ఛాతికి సంబంధించిన అనారోగ్యం బాధించవచ్చు. వాహన కొనుగోలు, భూ సంబంధ లావాదేవీలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. మీ జీవిత భాగస్యామి వృత్తి విషయంలో అనుకోని మార్పు చోటుచేసుకుంటుంది.

కుంభం

కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా సోదరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం. అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి. అనవసర సమస్యలో ఇరుక్కోవాల్సి వస్తుంది.

మీనం

ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. అనుకోని చోటు నుంచి డబ్బు వస్తుంది. అయితే ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం. వాద, వివాదాలకు దూరంగా ఉండండి. మీరిచ్చే సలహా కూడా వివాదానికి దారి తీసేలా చేస్తుంది. దాని కారణంగా మీ గౌరవం కోల్పోవాల్సి వస్తుంది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu