‘‘ఐఫోన్ X’’ పై యాపిల్ షాకింగ్ నిర్ణయం

First Published Jan 23, 2018, 4:32 PM IST
Highlights
  • ఐఫోన్ X ఫోన్ల అమ్మకాలను నిలిపివేయనున్న యాపిల్

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన  ఐఫోన్ X ఫోన్ల అమ్మకాలను నిలిపివేయాలనుకుంటోంది. కేవలం మరో ఆరు నెలలు మాత్రమే ఈ ఫోన్లు మార్కెట్ లో లభ్యం కానున్నాయి. అసలు విషయం ఏమిటంటే..  యాపిల్ కంపెనీ ఐఫోన్లు విడుదల చేయడం మొదలుపెట్టి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా.. ఈ ‘‘ఐఫోన్ X’’ ని విడుదల చేసింది. ఇందులో ప్రత్యేకంగా ఫేస్ రికగ్నైజేషన్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అత్యాధునిక ఫీచర్లు ఉండటంతో.. దీని ధర కూడా కాస్త ఎక్కువగానే ప్రకటించింది.

ధర ఎక్కువగా ఉండటంతో.. దీనిని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించలేదు. ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో ఈ ఫోన్‌ను తప్పించి సెకండ్ జనరేషన్ మోడల్‌ను మార్కెట్‌లోకి తేవాలని యాపిల్ భావిస్తోంది. తొలుత ఫోన్ ధర తగ్గించాలని భావించింది. కానీ.. మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు.. ఏకంగా ఆ ఫోన్ అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ ఫోన్ ధర తగ్గిస్తే.. తమ కంపెనీ కి చెందిన తక్కువ ధర ఫోన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని.. అందుకే ధర తగ్గించడం లేదని కంపెనీ తెలిపింది. మొత్తానికి ఐఫోన్ X కావాలి అనుకునే వారు.. ఆరు నెలల్లో కొనుగోలు చేసుకోండి. ఈ ఏడాది జూన్ నుంచి ఈ ఫోన్లు అమ్మకాలు నిలిచిపోనున్నాయి.

click me!