నిరుద్యోగులకు శుభవార్త.. పశువులు మేపడం వస్తే ప్రభుత్వ ఉద్యోగం

First Published May 12, 2017, 10:45 AM IST
Highlights

సర్కారు నౌకరీల కోసం సవాలక్ష పుస్తకాలు చదవనవసరం లేదు. కోచింగ్ సెంటర్ల కు వేల రూపాయిలు కట్టనవసరం లేదు. జస్ట్ మీకు పశువులను మేపడం వస్తే చాలు... ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ..

నిజంగా ఇది నిరుద్యోగులకు శుభవార్తే. ప్రభుత్వ ఉద్యోగం అంటే మాటలా... ఎన్ని పుస్తకాలు చదవాలి... ఎన్ని పరీక్షలు రాయాలి... ఎంత డబ్బులు ఖర్చుపెట్టాలి.

 

ఇప్పుడు అవేమీ లేకుండానే గవర్నర్ మెంట్ జాబ్ ఈజీగా వచ్చే ఓ సదావకాశం వచ్చింది.

 

పశువులను సరిగా మేపడం వస్తే తాము ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. 8 వ తరగతి పాస్ అవడం విద్యార్హతగా పేర్కొంది.

 

సెలం జిల్లాల్లో 70 పోస్టులను ఇలా భర్తీ చేసేందుకు నిర్ణయించింది. అయితే అధికారులు ఊహించని రీతిలో దీనికి గ్రాడ్యుయేట్ లు, పోస్టు గ్రాడ్యుయేట్ లు పోటీ పడ్డారు.

 

కేవలం 70 ఉద్యోగాలకు 1300 మంది అప్లై చేసుకున్నారు. వీరందరినీ ఇంటర్వ్యూ చేయడానికి 17 మంది ఉద్యోగుల ప్యానెల్ అనేక రకాల టెస్టులు పెట్టింది.

 

అందులో పశువులను మేపడం అనేదే అత్యంత కీలకమైంది. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికే ఉద్యోగం వస్తుంది.

 

గత వారం రోజుల నుంచి అక్కడి ఉన్నతాధికారులు ఈ ఉద్యోగానికి వచ్చిన అభ్యర్థులను పశువుల దగ్గరికి తీసుకెళ్లి వారి సామర్థ్యాన్ని పరీక్షిస్తూనే ఉన్నారు.

 

ఇంకా తుది ఫలితాలు మాత్రం వెలువడలేదు.

click me!