నేటి తిరుమల సమచారం

First Published Sep 12, 2017, 7:59 AM IST
Highlights

** సర్వదర్శనం కోసం 2 
   కంపార్టమెంట్ లలో భక్తులు
   ‌స్వామి దర్శనం కోసం
   వేచియున్నారు.

** సర్వదర్శనానికి 04 గంటల
   సమయం పడుతుంది.

**అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు రిషికేశ్‌లోని శ్రీవారి  పవిత్రోత్సవాలు

తిరుమల సమాచారం 

మంగళవారం (12.09.2017)
 

**సర్వదర్శనం కోసం 2
   కంపార్టమెంట్ లలో భక్తులు
   ‌స్వామి దర్శనం కోసం
   వేచియున్నారు.

**సర్వదర్శనానికి 04 గంటల
   సమయం పడుతుంది.

** కాలినడకన తిరుమలకి
   చేరుకున్న భక్తులను ఉ:
   08 గంటల తరువాత
   దర్శనానికి అనుమతి మొదలయింది.

** నిన్న సెప్టెంబర్ 11 న
   66,450 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
**నిన్న 27,388 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.

** నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:2.86కోట్లు...

 

అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు రిషికేశ్‌లోని శ్రీవారి  పవిత్రోత్సవాలు

సెప్టెంబర్‌ 11, తిరుపతి, 2017: టిటిడి పరిధిలోని రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగిన పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల వల్ల ఒక సంవత్సరంపాటు యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు.

సెప్టెంబరు 30న అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. అక్టోబరు 1న అకల్మషహోమం, పవిత్ర ప్రతిష్ఠ, అక్టోబరు 2న పవిత్ర సమర్పణ, వీధి ఉత్సవం నిర్వహిస్తారు. అక్టోబరు 3న పూర్ణాహుతి, హోమం, వీధి ఉత్సవం జరుగనున్నాయి. రూ.500/- చెల్లించి గ హస్తులు(ఇద్దరు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.

click me!