ఫేక్ బాబాల జాబితా ఇది..!

Published : Sep 11, 2017, 02:31 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఫేక్ బాబాల జాబితా ఇది..!

సారాంశం

తనను తాను దేవుడిగా ప్రజలను నమ్మిస్తున్న బాబాలు మన దేశంలో చాలా మందే ఉన్నారు వారిలో 14మంది దొంగ బాబాల జాబితాను తయారు చేసింది.. ఆల్ ఇండియా అఖాడ పరిషత్( ఏఐఏపీ).

తనను తాను దేవుడిగా ప్రజలను నమ్మిస్తున్న బాబాలు మన దేశంలో చాలా మందే ఉన్నారు. ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేసినందుకుగాను డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతనికి 20 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించారు. ఒక డేరా బాబానే కాదు.. రాధేమా, ఆశారాం బాపు లాంటి చాలా మంది  ఫేక్ బాబాలు మన దేశంలో ఉన్నారు.

కాగా.. వారిలో 14మంది దొంగ బాబాల జాబితాను తయారు చేసింది.. ఆల్ ఇండియా అఖాడ పరిషత్( ఏఐఏపీ). ఈ జాబితాలో ఉన్న బాబాలపై చర్యలు తీసుకోవాలని, వారికి కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

ఈ దొంగ బాబాల జాబితాలో రాధేమా, ఆశారాం బాపు, రామ్ పాల్, నిర్మల్ బాబా, నచ్చిదానంద్ గిరి, స్వామి అసీమానందా, నారాయణ్ సాయి లాంటి వారు ఉన్నారు. వీరి జాబితాను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపనున్నట్లు ఏఐఏపీ ప్రెసిడెంట్ మహంత్ నరేంద్ర గిరి తెలిపారు.

 ఈ దొంగ బాబాలందరినీ.. దేశం నుంచి తరిమివేయాలని.. వారికి తగిన శిక్షలు విధించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇలాంటి బాబాలను కుంభమేళాల్లో కూడా పాల్గొననివ్వకూడదని కోరారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu