అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ

First Published Sep 11, 2017, 2:04 PM IST
Highlights
  • కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
  • 2వారాల పాటు సాగనున్న ఈ పర్యటనలో రాహుల్.. పలువురు రాజకీయ నాయకులు , గ్లోబల్  థింకర్స్ లతో సమావేశం కానున్నారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. దాదాపు 2వారాల పాటు సాగనున్న ఈ పర్యటనలో రాహుల్.. పలువురు రాజకీయ నాయకులు , గ్లోబల్  థింకర్స్ లతో సమావేశం కానున్నారు.

 కాలఫోర్నియా యూనివర్శిటీలో విద్యార్థులతో మొదట ఆయన సమావేశం కానున్నారు. ‘  ఇండియా ఎట్ 70- రిఫ్లెక్షన్ ఆన్ ద పాత్ ఫార్వర్డ్’ అనే అంశంపై ఆయన విద్యార్థలతో చర్చించనున్నారు.  అంతకముందు రాహుల్ కి సాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు సామ్ పిత్రోడా, శుధ్ సింగ్ లు స్వాగతం పలకనున్నారు. రాహుల్ విద్యార్థులకు ప్రసంగం ఇవ్వనున్న కాలిఫోర్నియా యూనివర్శిటీ.. బుకింగ్స్  ఇప్పటికే అయిపోయాయట. ఆయన ప్రసంగం వినేందుకు అక్కడి వారు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారట. ఇందులో భాగంగానే  స్టేడియం మొత్తం టికెట్లు అయిపోయాయని.. బుకింగ్స్ క్లోజ్ చేసిన యూనివర్శిటీ యాజమాన్యం తెలిపింది.

 

రాహుల్ గాంధీ ప్రసంగం ఇవ్వనున్న కాలిఫోర్నియా యూనివర్శిటీలో 1949లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మధుగౌడ్ యాష్కి తెలిపారు. ప్రస్తుతం మన భారతదేశ ప్రజాస్వామ్యం, లౌకికవాద సమాజం ప్రమాదంలో పడిన పరిస్థితుల్లో ఉన్నామని మధు యాష్కీ అభిప్రాయపడ్డారు.

 

ఈ అంశాలపైనే రాహుల్ గాంధీ చర్చిస్తారని.. భారతదేశ భవిష్యత్తు గురించి తన ఆలోచనలు, అభిప్రాయాలను రాహుల్ చర్చిస్తారని మధు యాష్కీ ఈ సందర్భంగా చెప్పారు. సాన్ ఫ్రాన్సిస్కో లో పర్యటన అనంతరం  రాహుల్..  లాస్ ఏంజెల్స్ లో పర్యటిస్తారని తెలిపారు.

click me!