జోరుగా సాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు

First Published Sep 20, 2017, 10:35 AM IST
Highlights

సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తేదీ వరకు కన్నుల పండువగా  బ్రహ్మూత్సవాలు

శ్రీవారి బ్రహ్మూెత్సవాల వివరాలు...

శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలను పురస్కరించుకుని తిరుమల, తిరుపతిలో పలు వేదికలపై నిర్వహించనున్న ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు.  సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తేదీ వరకు బ్రహ్మూెత్సవాలు జరుగుతాయి. ఈ సందర్బంగా భక్తులను ఆకట్టుకునేలా ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య, దాససాహిత్య, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టులు, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌, శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, శ్రీవేంకటేశ్వర వేద పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.  తిరుమలలో నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బ్రహ్మూెత్సవాల వాహనసేవల్లో నిష్ణాతులైన పండితులతో వ్యాఖ్యానంఉంటాయి.  

తిరుమలలో..

తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ప్రతిరోజూ ఉదయం 5 నుంచి 5.30 గంటల వరకు మంగళధ్వని, ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు ధర్మగిరిలోని ఎస్వీ వేదపాఠశాల ఆధ్వర్యంలో చతుర్వేద పారాయణం, ఉదయం 6.30 నుంచి 7 గంటల వరకు విష్ణుసహస్రనామం, ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు ధార్మికోపన్యాసం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు నామసంకీర్తన/నృత్యం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.

నాదనీరాజనం వేదికపై చెన్నైకి చెందిన ప్రముఖ గాయకురాలు శ్రీమతి సవితా శ్రీరామ్‌, దక్షిణాఫ్రికాకు చెందిన భరతనాట్య కళాకారులు శ్రీమతి వృషిక పాతర్‌, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గాయకులు శ్రీ జెఎస్‌.ఈశ్వర్‌ప్రసాద్‌, కలకత్తాకు చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి శ్రీమతి తంగమని కుట్టి లాంటి ప్రముఖ కళాకారులు ప్రదర్శనలిస్తారు.

తిరుమలలోని ఆస్థానమండపంలో ప్రతిరోజూ ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.

తిరుపతిలో..

తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ధార్మికోపన్యాస కార్యక్రమాలు జరుగనున్నాయి. అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ధార్మిక, సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.

 

ఇది కూడా చదవండి

 

click me!