
‘స్వచ్ఛతా హీ సేవా’ సందేశం ప్రచారం కోసం ముందుకు రావాలని హీరోలు మహేశ్,ప్రభాస్ లకు ప్రధాని నుంచి లేఖలు వచ్చాయి. మలయాళీ సూపర స్టార్ మోహన్ లాల్ కూడా లేఖ అందింది. నటి అనూష్కకు కూడా ప్రధాని ఉత్తరం రాశార. అయితే, పవన్ కల్యాణ్ కు మాత్రం ఏ లేఖ రాలేదు. వచ్చి ఉంటే ఈపాటికి ఆయన ట్విట్టరెక్కి వుండేవారే. ఇది చర్చనీయాంశంగా మారింది. అంతమందికి వచ్చిన లేఖ పవన్ కల్యాణ్ కు రాకపోవడమేమిటి? దక్షిణాది నుంచి మోదీ లేఖలు అందుకున్నతారలందరి కంటే ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ సన్నిహితుడు. 2014 ఎన్నికలలో ఆయన ప్రధానితోకలసి ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు. మోదీ తో వేదికను పంచుకున్నారు. ఒక సారి ఢిల్లీ వెళ్లి కూడా కలుసుకున్నారు. అలాంటిది ఇపుడు ఒక ఉద్యమం లోకి ఆహ్వానించడానికి కూడా ప్రధాని చొరవ తీసుకో లేక పోయారు. దీనిఅర్థమేమిటిని రాజకీయ పరిశీలకుల్లో, పవన్ అభిమానుల్లో ప్రశ్న మొదలయింది. టాలివుడ్, బాలివుడ్, కోలివుడ్ లలో ఎందరికో ఉత్తరాలు రాసినపుడు పవన్ ను మర్చిపోవడం సాధ్యమా?
పవన్ ఆ మధ్య బిజెపి నాయకత్వం మీద క్రిటికట్ స్టాండ్ తీసుకోవడం పార్టీకి నచ్చలేదని చెబుతున్నారు. దీనికి తోడు ఆయన నాటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిమీద వ్యక్తిగతంగా కూడా దాడి చేశారు.బిజెపి జాగ్రత్తగా జైహింద్ అంటూ సెంటిమెంట్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నపుడు పవన్ కల్యాణ్ ఉత్తర భారత మీద తిరుగుబాటు జండా ఎగరేశారు. దక్షినాది వాళ్లు అని సపరేట్ చేశారు. ఉత్తర, దక్షిణ భారతాలు రెండు అనే భావం కల్గించేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారని ,అందువల్ల ఆయన బిజెపి హిందూ అజండాలో పనికి రాడని రాష్ట్ర బిజెపి నాయకులు అమిత్ షాకు చెప్పారని, దానివల్లే ప్రధాని కార్యాలయం పవన్ ను విస్మరించిందని చెబుతున్నారు.
దీనివల్లే ‘స్వచ్ఛతా హీ సేవా’ సందేశం ప్రచారం చేసేందుకు ఎంచుకున్నసెలెబ్రిటీలలో పవన్ కు చోటు లేకుండా పోయింది. కొంత ఆశాజీవులు ప్రధాని నుంచి ఇంకా లేఖలు వస్తూనే ఉన్నాయని, కొద్దిగాముందు వెనక కావచ్చని సమర్థించేవారూ ఉన్నారు.
ఏమయినా, తెలుగుతారలకు సంబంధించి ఉత్తరమంటూ వస్తే, మొదటి ఉత్తరం రావలసింది పవన్ కే కదా. అలాంటిది, మోహన్ బాబు, మహేశ్ బాబు, ప్రభాస్ వంటి వారికి వచ్చినా పవన్ కు రాకపోవడం ఏమిటి?
అందుకే అనుమానాలు. మోదీకి పవన్ కు చెడిందని, బిజెపి ఇక ఆయన్ని దూరంగా పెడుతుందని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.