
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కి రికార్డు సృష్టించబోతున్నారు. అంతేకంటే ముందే మరో రికార్డు సృష్టించారు.
2016 టైమ్ పర్సన్ ఆఫ్ ది ఈయర్ గా ట్రంప్ ఎన్నికయ్యారు. నిజంగా ఇది కూడా అందరి అంచనాలను తలకిందులు చేసిన విషయమే. గత వారం వరకు టైమ్ రీడర్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2016 ఆన్ లైన్ పోల్ లో ప్రధాని నరేంద్రమోదీ టాప్ లో నిలిచారు.
కానీ, పర్సన్ ఆఫ్ ది ఈయర్ గా మాత్రం ట్రంప్ ఎన్నికయ్యారు. ఇక రన్నరప్ గా ఆ దేశ విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ నిలిచారు. ప్రపంచంలో విశేష ఆదరణ కలిగిన వారికి ప్రతి ఏటా ఈ అవార్డును టైమ్స్ అందిస్తోంది.
ఈ అవార్డు పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అవార్డు తనకు దక్కడం చాలా గొప్ప గౌరవమని పేర్కొన్నారు. టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2016 తుది జాబితాలో కూడా మోదీకి చోటు దక్కలేదు.