
పవన్ కల్యాణ్..
వెండితెరపై ఓ సంచలనం..
హిట్లు.. ప్లాపులతో సంబంధంలేకుండా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సమ్మోహనాస్త్రం
రాజకీయాల్లో అడుగుపెట్టి.. సామాన్యుడి గళాన్ని వినిపిస్తున్న సరికొత్త కెరటం..
వెండితెరపై పవర్ స్టార్ గా , రాజకీయాల్లో జనసేనుడిగా రెండువైపులా దూసుకెళ్తున్న పవన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆడియో పంక్షన్ ఏ హీరో దైనా అక్కడ పవన్ జిందాబాద్ నినాదాలు వినిపించాల్సిందే. తారలకే ఆయన అభిమానతార ... ఇక సినీ అభిమానులకు గురించి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు.
అందుకే తమ అభిమాన హీరో కోసం ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లి గూడెంకు చెందిన అభిమాని ఒకరు ఏకంగా విగ్రహం కట్టించారు.
సీతాల చందుమోహన్ అనే అభిమాని శిల్పి అరుణప్రసాద్ తో పవన్ విగ్రహాన్ని రూపొందించారు. అయితే విగ్రహాన్ని ఇంకా ఆవిష్కరించలేదు. ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన ఈ విగ్రహం ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.
అన్యాయాన్ని ప్రశ్నించడం పవన్ అభిమానిగా నా ధర్మం. ఈ సందేశాన్ని ప్రజలందరికీ చాటాలని భావించా. అందులో భాగంగానే పవన్ విగ్రహాన్ని స్థాపించాలనుకున్నా అని చందుమోహన్ తెలిపారు. విగ్రహం ప్రారంభానికి పవన్‌ను పిలుస్తామని తెలిపారు.