
తెలుగు నాట పల్లె పాట అడుగడుగునా తారపడుతుంది. పల్లెపల్లెలో పాట కట్టడం గాలివీచినంత నిశబ్దంగా జరిగిపోతూఉంటుంది. తెలంగాణా ఉద్యమయితే ఎంతమంది పాటగాళ్లను తయారుచేసిందో లెక్కేలేదు. అది ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత ఏర్పడిన టిఆర్ ఎస్ ప్రభుత్వం కావచ్చు...ఇపుడు తాజాగా వస్తున్న ప్రభత్వ వ్యతిరేకత కావచ్చు,తెలంగాణలో పాట రూపమే తీసుకుంటుంది. ఇపుడు వృత్తుల వారీగా సర్వత్రా పాటలొస్తున్నాయి. పాట అన్ని వైపుల వ్యాపిస్తూ ఉంది. ఈ వరవడిలో తాజాగా విడుదలయిన చేనేత పాట వినండి...