కెసిఆర్ ఎపుడూ హాజరుకాని మీటింగేది?

First Published Aug 19, 2017, 2:08 PM IST
Highlights
  • కెసిఆర్ ఎపుడూ హాజరు కాని  మీటింగొకటుంది.
  • ఆయన హాజరుకాకపోవడం వల్ల రైతుల కు బాగా హాని జరుగుతూ ఉందని జీవన్ రెడ్డి అంటున్నారు.
  • ఆ మీటింగేమిటో తెలుసా?

కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  ఈ రోజు ఒక ఆసక్తి కరమయిన విషయం వెల్లడించారు.

ఎస్ ఎల్ బిసి (స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్) కు రాని ముఖ్యమంత్రి ఆయన ఒక్కరే అని జీవన్ రెడ్డి విలేకరులకు చెప్పారు.

 ఈ మీటింగ్ కు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. రైతులకు ఎంతరుణం ఇవ్వాలి, ఇస్తున్నారా లేదా, ఇవ్వకపోతే ఏమిచేయాలి, వసూళ్లెలా ఉన్నాయి... అనే విషయాలన్నీ ఈ సమావేశంలో చర్చకు వస్తాయి.

ఇలాంటి మీటింగ్ కు తెలంగాణా ముఖ్యమంత్రి రానే రాడని, ఇది విడ్డూరమని జీవన్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేదని అడిగితే,  అది కేంద్రం బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తి వేసింది.ఈ ఖరీఫ్ నుండే 4 వేలు ఎకరాకు రైతులకు ఇవ్వవలసి ఉండే రైతు సమస్యలను దృష్టి మళ్లించడానికే సమగ్ర భూ సర్వే ను సీఎం తెరమీదకు తీసుకవచ్చారు. మండలానికి ఒక్క సర్వేయర్ కూడా దిక్కు లేరు

ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయి 2 నెలలు గడుస్తున్నా రైతులకు బ్యాంకర్లు లోన్లు  కూడా ఇవ్వడం లేదు,’ అంటూ, ఇదంతా ముఖ్యమంత్రికి ఎస్ ఎల్ బిసి మీటింగ్ మీద ఆసక్తి లేకపోవడం వల్లే వస్తున్నదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కి ఈ మీటింగ్ మీద ఆసక్తి లేకపోవడంతో,  ఖరీఫ్,రబీ జిల్లా స్థాయి బ్యాంకర్స్ మీటింగ్ లు కూడ ఇంతవరకు నిర్వహించలేదు.పెట్టుబడి రాయితీ కాదు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అయితే,ప్రకటనల తోనే కాలం గడుపుతున్నారని ఆయన విమర్శించారు.సమగ్ర భూ సర్వే కూడా మరొక సమగ్ర కుటుంబ సర్వే లాగే చప్పుడు చేసి చల్లబడుతుందని ఏద్దేవా చేశారు.

click me!