
రేపు ఆదివారం కదా.. ఉదయాన్నే ఏదైనా అర్జెంట్ పని మీద బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీ నిర్ణయాన్ని కాస్త సడలించుకోండి. లేకుంటే ట్రాఫిక్ లో ఇరక్కు పోయి అవస్థలు పడతారు.నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషరేట్ల పరిధిలో ఆదివారం ఉదయం మారథాన్ రన్ -2017 నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్యలు తెలిపారు. హైదరాబాద్ లో ఆదివారం ఉదయం 4.30గంటల నుంచి 9 గంటల వరకు, సైబరాబాద్ లో ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.
హైదరాబాద్ లో ట్రాఫిక్ మల్లించే కూడళ్లు..
ఖైరతాబాద్ లోని వీవీ విగ్రహం, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఇక్బాల్ మినార్,లిబర్టీ, కర్బలా మైదాన్, కవాడిగూడ క్రాస్ రోడ్డు, డీబీఆర్ మిల్స్, నల్లగుట్ట జంక్షన్, గ్రీన్ లాండ్ జంక్షన్, ఎన్ఎఫ్ సీఎల్ లాండ్, క్యాన్సర్ ఆసుపత్రి, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్డు నెం.1-45 జంక్షన్ ,రోడ్డు నెంబర్,36-10 జంక్షన్
సైబరాబాద్ లో ట్రాఫిక్ మళ్లించే కూడళ్లు..
కావూరి హిల్స్ 36 జంక్షన్, సైబర్ టవర్ జంక్షన్, బయో డైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్, జీహెచ్ఎంసీ ఆఫీస్ లింగంపల్లి జంక్షన్, విప్రో జంక్షన్, గోపన్నపల్లి క్రాస్ రోడ్స్. సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్, మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోకి ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆదివారం ట్రక్కులు, లారీలు, డీసీఎంలు, వాటర్ ట్యాంకు తదితర వాహనాలకు అనుమతి నిలిపివేశారు.
కనుక ఈ రూట్లలో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లి తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని మనవి.