తెలుగువారిపై ట్రంప్ పిడుగు

First Published Feb 1, 2017, 3:20 AM IST
Highlights

వీసా నిబంధనల్లో అధ్యక్షుడు చేసిన మార్పులు గనుక ఆమోదంపొందితే సుమారు 90 వేల మంది తెలుగుయువత భారత్ కు తిరిగి వచ్చేయక తప్పదు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేస్తున్నాడు. కోటి కలలతో హెచ్ 1 బి వీసాపై అమెరికాలో అడుగు పెట్టిన తెలుగువారి నెత్తిన ట్రంప్ పిడుగుపడినట్లే. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుండి భారతీయులకు ప్రత్యేకించి తెలుగువారికి సమస్యలు మొదలయ్యాయి. వీసా నిబంధనల్లో అధ్యక్షుడు చేసిన మార్పులు గనుక ఆమోదంపొందితే సుమారు 90 వేల మంది తెలుగుయువత భారత్ కు తిరిగి వచ్చేయక తప్పదు. అమెరికాలో ప్రస్తుతం తెలుగువారి సుమారు 1.10 లక్షలున్నారు. వారిలో మారనున్న వీసా నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన వారు కేవలం 15 వేలమందికన్నా ఉండరన్నది సమాచారం.

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే పలు దేశాలకు సమస్యలు మొదలవుతాయని అందరూ అనుకున్నదే. అయితే, మరీ ఇంత తొందరగా తన మ్యానిఫెస్టో అమలును ట్రంప్ మొదలుపెడతారని మాత్రం ఎవరూ ఊహించలేదు. దాంతో వేలాదిమంది తెలుగుయువతలో ఆందోళన పెరిగిపోతోంది. 1.30 లక్షల డాలర్ల వేతనం ఉన్న వారిని మాత్రమే హెచ్ 1బి వీసాపై అమెరికాలో ఉండటానికి అనుమతించాలని ట్రంప్  ఆదేశాలు జారీ చేసారు.

 

 అమెరికాలో ఈ వీసాపై ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు 3 లక్షలమంది. మరో మూడు లక్షల మంది వివిధ కోర్సుల్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.  ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయుల్లో ఏడాదికి 1.30 లక్షల డాలర్ల వేతనాలున్న వారి సంఖ్య చాలా తక్కువ. అయితే, ట్రంప్ ఆదశాలు అన్నీ కంపెనీలకూ ఒకే విధంగా అమలవుతాయి కాబట్టి లక్షలది మంది భారతీయులు వెనక్కు వచ్చేయక తప్పదు. ఇన్ఫోసిస్, టిసిఎస్,ఐబిఎం, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో పని చేస్తున్న వారిలో కొద్దొమందికి మాత్రమే ఏడాదికి 1.3 లక్షల డాలర్ల వేతనాలున్నాయి. ట్రంప్ చెప్పినట్లు భారీ జీతాలు ఇవ్వలేని చాలా కంపెనీలు వెంటనే ఉద్యోగులను తొలగిస్తాయి. దాంతో ఒక్కసారిగా లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడతారు.

 

 

 

 

 

 

అమెరికా యువతకన్నా ఇతర దేశాల్లో ప్రత్యేకించి భారతీయుల్లో ఐటి నిపుణులెక్కువ. అమెరికా యువతలో నైపుణ్యం తక్కువతో పాటు చిన్న జీతాలకు పనిచేయటానికి ఇష్టపడరు. దాంతో భారతీయ యువతకు ఉద్యోగాలు తొందరగా వస్తాయి. కాబట్టే అమెరికాలో ఏ కంపెనీలో చూసినా భారతీయులే కనబడతారు. అందులోనూ పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల తర్వాత తెలుగువారే ఎక్కువ. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అనే ట్రంప్ ఎన్నికల హామీ. తెలంగాణా ఉద్యమంలో కెసిఆర్ నినాదం లాంటిదే ట్రంప్ ఎన్నికల హామీ కూడా. దాంతో అమెరికన్లు ఆకర్షితులై ట్రంప్ ను గెలిపించారు. బాధ్యతలు తీసుకోగానే ట్రంప్ తన హామీలను అమల్లోకి తెస్తుండటంతో తెలుగువారికి సమస్యలు మొదలయ్యాయి.

 

 

 

 

 

 

click me!