అంతకు మించి బంగారం కొంటే... ?

First Published Jan 31, 2017, 10:06 AM IST
Highlights

ధర తగ్గింది కదా అని ఇకపై భారీ మొత్తంలో బంగారు అభరణాలు కొంటున్నారా.. అయితే జాగ్రత్త

వచ్చే బడ్జెట్ లో బంగారం, వెండి కొనుగోళ్లపై కొత్త నిబంధనలు విధించబోతున్నారు.  ఇకపై రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో బంగారం, వెండి అభరణాలు కొనుగోళు చేస్తే తప్పనిసరిగా పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ కార్డును సమర్పించాల్సిందే. ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త నిబంధన అమలుకానుంది.

 

ప్రస్తుతం రూ.2 లక్షల కంటే ఎక్కువకు ఆభరణాలు కొనుగోలు చేస్తే, బంగారం మార్కెట్లో కేవైసీ కంప్లియన్స్ ను సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడది రూ.50 వేలకు తగ్గించే అవకాశం ఉందని బులియన్ వర్గాలు చెబుతున్నాయయి.

 

కేంద్రం ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం పెద్ద నోట్ల రద్దు ప్రభావమే అని తెలుస్తోంది. నోట్ల రద్దు తర్వాత నల్లధనం భారీగా కూడబెట్టిన వారు బంగారాన్ని భారీ స్థాయిలో కొనుగోళు చేశారు.

 

తమ దగ్గర ఉన్న బ్లాక్ మనీని బయట పడకుండా చూసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవకాశం వారికి ఇవ్వకుండా బంగారంపై ఇలా కొత్త నిబంధనలు విధించనట్లు తెలుస్తోంది.

click me!