మస్కట్ లో తెలంగాణ గల్ఫ్ వర్కర్ మృతి

First Published Jul 11, 2017, 6:45 PM IST
Highlights

అనారోగ్యంతో  ఒక తెలంగాణా వలస కూలీ  మస్కట్ అసుపత్రిలో మృతి చెందాడు.
జగిత్యాల జిల్లా, రాయికల్ మండలం, మూటపల్లి గ్రామానికి చెందిన ఆలుపట్ల నర్సయ్య (54) ఓమాన్ దేశంలోని మస్కట్ బల్దియా మచ్చి మార్కెట్ లో పారిశుద్ద కార్మికుడుగా పనిచేస్తున్నాడు. శనివారం తేది( 08.07.2017) న ఆయన అనారోగ్యంతో మస్కట్ లోని కౌలా హాస్పిటల్ లో  చికిత్స పొందుతూ మృతిచెందాడు.

అనారోగ్యంతో తెలంగాణా వలస కూలీ ఒకరు మస్కట్ అసుపత్రిలో మృతి చెందాడు.
జగిత్యాల జిల్లా, రాయికల్ మండలం, మూటపల్లి గ్రామానికి చెందిన ఆలుపట్ల నర్సయ్య (54) ఓమాన్ దేశంలోని మస్కట్ బల్దియా మచ్చి మార్కెట్ లో పారిశుద్ద కార్మికుడుగా పనిచేస్తున్నాడు. శనివారం తేది( 08.07.2017) న ఆయన అనారోగ్యంతో మస్కట్ లోని కౌలా హాస్పిటల్ లో  చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఆయన మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపాలని భీమ్ రెడ్డి మిత్రులు మస్కట్ (ఓమాన్) లోని ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసికెళ్ళారు. ఈ విషయాన్నిజగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లామని  'తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్' (TeGWA - తెగువ) అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి చెప్పారు.
మస్కట్ లో ఉన్న జగిత్యాలకు చెందిన సామాజిక సేవకులు, ప్రముఖ ప్రవాస భారతీయ వ్యాపారవేత్త శ్రీ నరేంద్ర పన్నీరు (+968 9783 7893) ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నారు.

click me!