అనంతపురం అమ్మాయికి గ్రూప్ 2 ఉద్యోగమిచ్చిన చంద్రబాబు

Published : Jul 11, 2017, 03:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
అనంతపురం అమ్మాయికి గ్రూప్ 2 ఉద్యోగమిచ్చిన చంద్రబాబు

సారాంశం

మాట ఇచ్చినట్లు అనంతపురం జిల్లాలో తండ్రి  క్రూరత్వానికి బలయి అనాథ గా మారిని లక్ష్మీ ప్రసన్నకు ముఖ్యమంత్రి రు.20 లక్షల ఆర్థిక సహాయంతో పాటు గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. అధికారులకు ఈ మేరకు ఆయన అదేశాలిచ్చారు. ఈ రోజు లక్ష్మీ ప్రసన్న జెసి సోదరులు సహాయంతో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.

కుటుంబాన్ని కోల్పోయిన తాడిపత్రి  తండ్రి హింస  ఘటన బాధితురాలు లక్ష్మీప్రసన్నకు గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన లక్ష్మీ ప్రసన్నకలుసుకుని ఆయన ఇచ్చిన హామీ ని గుర్తు చేశారు. 
ఈనెల 5న అనంతపురము వెళ్లినపుడు  లక్ష్మీప్రసన్న విషాదాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆమెకు దైర్యం చెప్పి అండగా వుంటానని  ప్రకటించిన సంగతి తెలిసిందే.
ముక్తాపురం గ్రామసభలో లక్ష్మీప్రసన్నకు రూ.20 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని ఆయన ఆరోజు భరోసా ఇచ్చారు.అమరావతి వచ్చి కలసుకోమని చెప్పారు.

 

 కొద్ది రోజుల కిందట తండ్రి తల్లిని, చెలెళ్లను  క్రూరంగా చంపేయడంతో ఆమె అనాథ అయింది. 

ముఖ్యమంత్రి సూచన మేరకు లక్ష్మీప్రసన్నను ఈ రోజు  జేసీ సోదరులు తీసుకువచ్చారు.లక్ష్మీప్రసన్నతో మాట్లాడి విద్యార్హతలు అడిగి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుసుకున్నారు.


ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకున్నానని తెలిపిన లక్ష్మీప్రసన్న చెప్పారు.అనంతరం,
అధికారులతో మాట్లాడి గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి  నిర్ణయించారు.
అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో వుండాలని లక్ష్మీప్రసన్నకు సీయం సలహా ఇచ్చారు.
ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా ఉంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.


ఉద్యోగం వచ్చినా ఎంత వరకు చదివితే అంతవరకు చదువుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 
ఈ ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఇంకా ఉన్నత పదవులు సంపాదించాలని లక్ష్మీప్రసన్నకు ముఖ్యమంత్రి చెప్పారు.

 

ఆరు నెలలకు ఒకసారి వచ్చి కలవాలని కూడా ఆయన చెప్పారు.


 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !