ఎమ్మెల్యే టిఫిన్‌లో పురుగులు

Published : Jul 11, 2017, 03:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఎమ్మెల్యే  టిఫిన్‌లో పురుగులు

సారాంశం

ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మంగళవారం ఉదయం  విజయవాడనగరంలోని హోటల్‌ గ్రాండ్‌ మినర్వాలో టిఫిన్ చేస్తుండగా పురుగులు కనిపించడంతో అవాక్కయ్యారు.  దీంతో ఆయన విషయాన్ని హోటల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చే శారు. వారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎమ్మెల్యే రామారావు  కు కోపమొచ్చింది. ఆహార నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు.

 

విజయవాడ నగరంలోని ఒక హోటల్ తెలుగుదేశం ఎమ్మెల్యేకి ఛేదు అనుభవం ఎదురయింది. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు  చేస్తున్న టిఫిన్ లోనే పురుగులు కనిపించాయి. బొల్లినేని రామారావు మంగళవారం ఉదయం నగరంలోని హోటల్‌ గ్రాండ్‌ మినర్వాలో టిఫిన్ చేస్తుండగా ఇది జరిగింది. ఈ  విషయాన్ని హోటల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యే రామారావు ఆగ్రహంతో  ఆహార నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇపుడు హోటల్ లో ఆహారాలను పరీక్షిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !