సామాజిక సంబురంగా లండన్ లో కెసిఆర్ జన్మదినం

Published : Feb 14, 2017, 02:54 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
సామాజిక సంబురంగా లండన్ లో కెసిఆర్ జన్మదినం

సారాంశం

నూలు వస్త్ర ధారణ సందేశం పాటించాలని నిర్ణయం

లండన్ తెలంగాణా ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినాన్ని కేక్ కట్ చేసి చప్పట్లు కొట్టే రోటీన్ సెలెబ్రేషన్ గా కాకుండా సందేశాత్మకంగా, ఒక సామాజిక కార్యక్రమంగా నిర్వహించారు. మరొక విశేషమేమిటంటే, దీనితో  ఈ కార్యక్రమం రాజకీయాతీతం అయింది. చాలా మందిని ఆకట్టు కుంది. 

 

లండన్ లో కెసిఆర్ జన్మదిన(ఫిబ్రవరి 17) వేడుకలు అక్కడి ప్రజలకు అనుకూలంగా ఉండేలా మూడు రోజులు ముందుగానే ‘కెసిఆర్ మరియు తెరాస  సపోర్టర్స్ అఫ్ యూకే’ ఆధ్వర్యం లో (KCR & TRS supporters of UK) జరిగాయి.

 

 

 

ఏజ్ లింక్ అనే వృద్ధుల  సేవా సంఘం, ఓపెన్ హార్ట్  సేవ సంఘంతో  ఈ సంఘాల సభ్యులు చేతులు  అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు . #wearhandloom , వారానికొకసారైన చేనేత వస్త్రాలను ధరించండి అన్న ఎన్ ఆర్ ఐ మంత్రి కెటి రామారావు పిలుపును  ఈ రోజు ఆచరణ లో పెట్టారు. ప్రత్యేకంగా సిరిసిల్ల నుంచి తెప్పించిన నూలు వస్త్రాలను కోర్ కమిటి సభ్యులు ధరించి, ఈ నినాదానికి పూర్తి మద్ధతు ప్రకటించారు. ఈ  నినాదాన్ని లండన్ లో ఉన్న తెలుగువారందరిదగ్గరకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని  ఈ సంస్థల వ్యవస్థాపకులు సిక్కా చంద్ర శేఖర్ ఏషియానెట్ కు తెలిపారు.

 

 

భాస్కర్  పిట్టల సభ అధ్యక్షన జరిగిన ఈ కార్య క్రమం లో సుమారు 80 మంది వృద్దులు పాల్గొన్నారు మొదటి తరం సబంధించిన సిరిందెర్ పురేవాల్ (హెస్టన్  కౌన్సిల్)  పాల్గొన్నారు 

 

పాశ్చాత్య దేశాలలో వృద్ధులను  చాల  ఒంటరినితనం వేధిస్తుందని, ఈ స్థితిలో వారికి ఆత్మస్థయిర్యం  కల్గించడం అవసరమని వారు నొక్కి చెప్పారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా వారికి   మెడిటేషన్ ,సాంస్కృతిక  కార్యక్రమాలతో ఉత్సాహం నింపడమే కాకుండా  హైదరాబాద్ బిర్యానీ  రుచిని ,పసందయిన తెలంగాణ వంటకాలను  ఈ ఆంగ్లేయులకు పరిచయం చేశామని చంద్రశేఖర్ తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో చాలా సేపు  తమతో కలసిమెలసి ఉన్నందుకు  కార్యక్రమానికి వచ్చిన పెద్ద వారంతా మెలసి ఉన్నందుకు  ఎంతో ఆనందించారని, కెసిఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపారని సంస్థ సభ్యులు  సురేష్ గోపతి   అన్నారు .

 

 

“ కెసిఆర్ జన్మదినం  కేవలం జన్మదిన వేడుక కాదు అది యాత్  తెలంగాణ పండుగ.  ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కంటే  యువతకు మరియు మాలాంటి ప్రవాస భారతీయులకు ఒక  స్ఫూర్తి దాత.  అందరికి అందుబాటులో ఉండాలని ఈ కార్యక్ర మాన్ని   ముందుగానే నిర్వహిస్తున్నాం,అని  కాసర్ల నగేష్ రెడ్డి, వెంకట్ రంగు  తెలిపారు . 

 

 

కెసిఆర్ జన్మదిన వేడుకలను  తెరాస పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమం గా కాకుండా ప్రజల కార్యక్రమం గ నిర్వహించాలని, వారి ఉద్యమ స్ఫూర్తి  రాబోయే తరాలవారికి  తెలియచేయాలి అనే ఒకే ఒక నినాదం తో ఈ వేడుకలు చేస్తున్నామని   నరేష్ కుమార్ మరియు జయంత్ నార్పరాజు  తెలిపారు . 

 

 

అహింసా మార్గాన 4 కోట్ల మంది కి న్యాయం చేసిన వ్యక్తి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషమని  ప్రముఖ సంఘ సేవకులు  డాన్ జూన్సన్ తెలిపారు . 

 

 

 ఈ స్వచ్చంద  కారిక్రమాలకి  ఎంతో సంతోషించి ఏజ్ లింక్ సభ్యులు కూడా తెరాస కండువాలు కప్పుకొని జయధ్వానాలు ద్వారా తమ గౌరవం చాటారని ప్రమోద్ అంతటి భాస్కర్ మోతీ తెలిపారు. 

 

జన్మదిన సందర్భం గ  తెలంగాణ లో ఎన్నో సేవ కారిక్రమాల కు  శ్రీకారం చుట్టబోతున్నట్లు  కాన్ఫరెన్స్ ద్వారా  గోలి తిరుపతి  తెలియజేసినారు . 

 

ఈ కార్యక్రమం లో వివిధ దేశాలకు చెందిన  వృద్ధ సంఘ సేవకులు తో కలిపి  కోర్ టీం సభ్యులు సంతోష్ ఆకుల ,హరిబాబు గౌడ్ , తో పాటు  శిరీష చౌదరి ,శ్రీలక్ష్మి నాగులబండి ,, రమాదేవి ,జ్యోతి రెడ్డి ,ప్రీతీ నోముల ,వాణి అనుసరి ,స్వప్న అమీరహ్ ,గ్రాహం బేకర్ ,రిచర్డ్ సిషన్ ,డీన్ క్యారీ ,సాలీ హౌగ్ ,అనిల్ పాండే ,పార్థ ముడూర్ , వాలంటీర్లు గా పనిచేసినవారి లో ఉన్నారు .

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !