
శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణ పరిధిలో ఒక మహిళ ఆత్మ హత్య చేసుకునేందుకు బావిలో దూకింది.
అయితే ఆమె బావి వైపు పోతుండటం చూడటం, ఆపైన బావిలో దూకిన శబ్దం ...అక్కడ విధి నిర్వహణలో ఉన్న సర్కిలిన్స్పెక్టర్ రాజే ష్ విన్నాడు. ఒక క్షణం కూడా జాప్యం లేదు. పోలీస్ డ్రెస్ తోనే బావిలో దూకాడు. తన ప్రాణాల్ని పణంగా పెట్టి మహిళను బయటకు తీసుకువచ్చి కాపాడాడు. మహిళ నీళ్లలో మునిగి పోకుండా శక్తి నంత కూడదీసుకుని ఆయన చాల సేపు నిలబడాల్సి వచ్చింది.
బయటకు తీసే ఏర్పాట్లు చేసేంతవరకు రాజేష్ అలాగే ఆమెను పట్టుకునే వున్నారు. సుమారు నలభై నిమిషాలకు పైగా ఆమె మునిగిపోకుండా పట్టుకునే ఉన్నారు. ఈ సంఘటన టెక్కలిలో ఈ రోజు పెద్ద సంచలనం సృష్టించింది. రాజేష్ ని హీరోగా కీర్తించారు ప్రజలంతా. మహిళ కుటుంబసబ్యులనుండే గాకుండా, ఆయనను అభినందించడానికి స్థానికులు, స్థానికేతరుల ప్రవాహంలా వచ్చారు.