మోదీ హాఫ్ సెంచ‌రీకి ఒక‌టే త‌క్కువ‌.

First Published Jul 21, 2017, 1:14 PM IST
Highlights
  • ప్రపంచ యాత్రలో రికార్డుకు దగ్గరలో మోదీ.
  • మూడు సంవత్సరాలలో 49 దేశాల పర్యటన.
  • పార్లమెంట్ లో ప్రకటన.

న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేసి మూడు సంవ‌త్సరాలు దాటింది. ఆయ‌న‌ 2014 మే 26 వ తేదీన ప్ర‌మాణస్వీకారం చేశారు. అంటే జులై నెల‌కు పూర్తిగా 38 వ నెల పూర్తికావ‌స్తుంది. అయితే  మోదీ ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత స‌రిగ్గా 20 రోజుల‌కు త‌న మొట్ట‌మొద‌టి విదేశీ టూర్ పై భూటాన్ వెళ్లారు. అప్ప‌టి నుండి మొద‌ల‌యింది ప్ర‌ధాని విదేశీ యాత్ర‌లు.


ఇప్ప‌టి వ‌ర‌కు న‌రేంద్ర మోదీ భార‌త‌దేశ ప్ర‌ధానిగా 49 ప్ర‌పంచ దేశాలు తిరిగారు. ఇదే విష‌యాన్ని పార్ల‌మెంట్ లో ఓ కాంగ్రెస్ ఎంపీ అడిగిన ప‌శ్న‌కి స‌మాధానంగా కేంద్రం స‌మాచారం ఇచ్చింది. అందులో ఆయ‌న గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా 49 దేశాలు ప‌ర్య‌టించార‌ని. అందులో అధికంగా 5 సార్లు అమెరికా ప‌ర్య‌టించార‌ని తెలిపారు. 

ఇప్పుడు ఇదే విష‌యం హాట్ టాఫిక్ అయింది. ప్ర‌ధాని మోదీ ఇండియాలో క‌న్న విదేశాల‌లోనే అధికంగా ఉంటున్నార‌ని నెటీజ‌న్లు సెటైర్లు వెస్తున్నారు.

click me!