జియో ప్రపంచ రికాార్డులివే...

Published : Jul 21, 2017, 01:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
జియో ప్రపంచ రికాార్డులివే...

సారాంశం

ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్ కంటే వేగంగా జియోకు ఆదరణ వీడియోలకు నెలకు 125 కోట్ల జీబీ ఇంటర్నెట్ వినియోగం ప్రతీ రోజూ 250 కోట్ల నిమిషాల కాల్స్

 ఈ రోజు జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం) లో ముఖేష్ అంబానీ ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో  తండ్రి  దీరూభాయ్ అంబానిని ని తలుచుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి వృద్ధి కనబరిచిన కంపెనీలు కొన్నేనని చెబుతూ  జియో 10 కోట్ల కస్టమర్లను  అధిగమించిందనిప్రకటించారు.ప్రస్తుతం రిలయన్స్ జియోకు 12.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని, సగటున ప్రతీ 7 సెకండ్లకు ఒక కస్టమర్ వచ్చి చేరుతున్నాడని ఆయన చెప్పారు. ఆయన వెల్లడించిన మరిన్ని విశేషాలు: 

 

  • ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్ కంటే వేగంగా జియోకు ఆదరణ
  • వీడియోలకు నెలకు 125 కోట్ల జీబీ ఇంటర్నెట్ వినియోగం
  •  ప్రతీ రోజూ 250 కోట్ల నిమిషాల కాల్స్
  • మొబైల్ డేటా వినియోగంలో నెంబర్ వన్ స్థానంలో ఇండియా
  • ఫ్రీ నుంచి పెయిడ్ సబ్‌స్క్రైబర్లుగా మారడం అతి పెద్ద రికార్డ్
  • ఉచిత కస్టమర్లను పెయిడ్ కస్టమర్లుగా మార్చగలిగాం..
  • 10 కోట్ల మంది కంటే అధికంగా పెయిడ్ కస్టమర్లు- ముఖేష్ అంబానీ
  • జియో ప్రైమ్, ధన్ ధనా ధన్ ప్లాన్స్ కొనసాగుతాయ్
  • ఇండియాలో 78 కోట్ల మొబైల్ ఫోన్స్
  • ఇందులో 50 కోట్ల ఫీచర్ ఫోన్స్ ఉన్నాయి
  • డిజిటల్ ఇండియా లక్ష్యంలో వీరు భాగం కాలేకపోతున్నారు
  • అందరికీ డిజికల్ సాధికారత లేకపోవడం బాధాకరం- ముకేష్ అంబానీ
  • రాబోయే 12 నెలల్లో దేశంలోని 99 శాతం మందికి అందుబాటులో జియో సేవలు
  • ఇండియాలో 2జీ కవరేజ్ కంటే 4జీ కవరేజ్ ఎక్కువ- ముకేష్ అంబానీ
  • పోటీ కంపెనీలకు 2జీ కవరేజ్ నిర్మాణానికి 25 ఏళ్లు పట్టింది..
  • 3 ఏళ్లలోనే అంతకు మించిన 4జీ నెట్వర్క్ నిర్మించాం- ముకేష్ అంబానీ
  • 50 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగాదారులు  డేటా సేవలను  మరింత దగ్గర చేస్తున్నా

మాతృసంస్థ  రిలయన్స్ గురించి ఆయన  ఇలా చెప్పారు

  • ఆర్ఐఎల్ ఐపీఓకు వచ్చిన తర్వాత ఇది 40వ సంవత్సరం
  • 1977లో రూ. 33 కోట్ల టర్నోవర్
  • 2017లో రూ. 3.3 లక్షల కోట్ల టర్నోవర్
  • 40 సంవత్సరాల్లో టర్నోవర్‌లో 4700 శాతం వృద్ధి రేటు
  • గత 40 ఏళ్లలో 10వేల రెట్లు పెరిగిన నికర లాభం
  • 3,500 నుంచి 2.5 లక్షలకు పెరిగిన ఉద్యోగుల సంఖ్య
  • ప్రతీ రెండున్నరేళ్లకు రెట్టింపు అయిన ఇన్వెస్టర్ల సంపద
  • 1977లో రూ. 1000 పెట్టుబడితే ఇప్పుడు దాని విలువ రూ. 16.5 లక్షలు

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu