అయ్యన్న పాత్రుడు సాక్షిగా... రావెల మీద ప్రజల ఆగ్రహం

First Published Jun 28, 2017, 5:28 PM IST
Highlights

మాజీ మంత్రి రావెల కిశోర్   బాబు కష్టాలు ఇంకా తీరలేదు. ఆయన చిల్లరబేరాలకు పోయి ఉద్యోగం పోగొట్టుకున్నారు. అయితే, ఆయన ఇంకా ఈ బేరాలు వదిలేసినట్లు లేదు. ఈ రోజు ఆయన మీద సొంత వూరి ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదికూడా మరొక మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎదురుగానే.

మాజీ మంత్రి రావెల కిశోర్  బాబు కష్టాలు ఇంకా తీరలేదు. 

ఆయన చిల్లరబేరాలకు పోయి భేషయిన ఉద్యోగం పోగొట్టుకున్నారు.

అయితే, ఆయన ఇంకా ఈ బేరాలు వదిలేసినట్లు లేదు.

ఈ రోజు ఆయన మీద ఆయన వూరి ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదికూడా మరొక మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎదురుగానే.

రావెల కిషోర్‌బాబు ఆహ్వానం మేరకు మంత్రి అయ్యన్న బుధవారం  మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుగుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో పర్యటీంచారు.

అయితే, స్థానికులు రావెల  వదల్లేదు. ఇదే అదను అనుకుని అయ్యన్న ఎదురుగా  రావెల తీరుకు నిరసన తెలిపారు.

ఇంత వరకు బాగానే ఉంది,  మంత్రి అయ్యన్న కాన్వాయ్ పోకుండా అడ్డుకున్నారు.

ఇంతకు స్థానికుల ఆగ్రహానికి కారణమేమిటో తెలుసా?

ఇంటి రుణాల మంజూరుకు రావెల కిషోర్‌బాబు డబ్బులు వసూలు చేస్తున్నాడు.

ఈ విషయం అయన్నకు చెబుతూ రావెల మీద  స్థానిక మహిళలు మండిపడ్డారు. 

అంతేకాదు,  ఇంకా తీవ్రమయిన ఆరోపణ చేశారు.

 టీడీపీ వారిని కాదని వైసీపీ వారికి రావెల ప్రాధాన్యమిస్తున్నారని అక్కసు వెళ్ల గక్కారు.

చాలా మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.  కదలనీయలేదు.

దీనితో  పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వారంతా మహిళలను పక్కకు తోసి మంత్రి అయ్యన్న కాన్వాయ్ ముందుకు పోనిచ్చారు.

 

 

 

 

click me!