ఇలా జరుగుతుందని బాబు ఊహించి ఉండరు

First Published Jun 28, 2017, 4:42 PM IST
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక  చిక్కు ప్రశ్న. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ ఆర్ పార్టీలలో బిజెపికి ఎవరు దగ్గిర? ఎన్డీయే సభ్యరాలు కాబట్టి తన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ యే ప్రధాని మోదీకి, బిజెపికి ఇష్టమయినవని అని అర్గ్యూ చేయాడాని వీల్లేదు. ఎందుకంటే, ఎన్డీయేలో లేకపోయినా, బిజెపి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపికి కూడా పెద్ద పీట వేస్తున్నది.

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక  చిక్కు ప్రశ్న. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ ఆర్ పార్టీలలో బిజెపికి ఎవరు దగ్గిర?

 

ఎన్డీయే సభ్యరాలు కాబట్టి తన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ యే ప్రధాని మోదీకి, బిజెపికి ఇష్టమయినవని అని అర్గ్యూ చేయాడాని వీల్లేదు. ఎందుకంటే, ఎన్డీయేలో లేకపోయినా, బిజెపి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపికి కూడా పెద్ద పీట వేస్తున్నాది.

 

దీనికి సాక్ష్యం, ఈ రోజు ఎన్డీయే తరుఫున  రాష్ట్రపతి అభ్యర్థి గా  నిలబడుతున్న రామ్ నాథ్ కోవింద్ తరఫున నాలుగో సెట్ నామినేషన్ వేసేందుకు  వైసిపిని  బిజెపి అహ్వానించడమే.

 

బుధవారం నాలుగో సెట్‌ నామినేషన్ పత్రాలను కోవింద్ తరఫున కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు  ఈ ఈ రోజు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. గత శుక్రవారమే రాష్ట్రపతి ఎన్నికల కోసం కోవింద్‌ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. 

 

ఈ నామినేషన్‌ పత్రం మీద వెంకయ్య తో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి కూడా సంతకం చేశారు ఈ  సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ రాష్ట్రపతి పదవికి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్ని విధాలా అర్హుడన్నారు. అత్యధిక మెజార్టీతో రామ్‌నాథ్‌ గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదె లా ఉన్నా, రాష్ట్రపతి ఎన్నిక వైసిపి, బిజెపిలనుబాగా దగ్గర చేసింది.

ఇలా బిజెపి, జగన్ దగ్గిరవడంతో ఇక ముందు టిడిపి వాళ్లు జగన్ ను జైలు పంపిస్తాం అని అరవడం కష్టం. అంతేకాదు, ఈ స్నేహం ఎలా వికిస్తుందో వూహించడం కష్టం. ఒక వేళ వైసిసి కూడా ఎన్డీయే లో చేరితే...టిడిపి వాళ్లకి నిద్ర కరువవుతుందేమో.

 

 

click me!