గో విక్రయాల పై కేంద్రం సంచలన నిర్ణయం

First Published May 26, 2017, 6:00 PM IST
Highlights

 కొత్త చట్టం ప్రకారం ఇకపై ఆవులరను, గేదెలను మాంసం దుకాణాలకు , కబేళాలకు అమ్మకూడదు. కేవలం రైతులకు మాత్రమే విక్రయించాలి. అదీ గుర్తింపు కార్డులున్న రైతులకు మాత్రమే అమ్మాలి. భూములున్న రైతులు మాత్రమే కొనుగోలు చేయాలి.

 

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గోవధపై నిషేధం విధించింది.

 

కేంద్ర పర్యావరణ శాఖ ఈ నిషేధం ఉత్తర్వులు జారీ చేసింది.  Prevention of Cruelty to Animals (Regulation of Livestock Markets) Rules, 2017  చట్టం ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసి గెజెట్ ఈ విషయం ప్రచురించారు.

 

ఈ చట్టం ప్రకారం ఇకపై ఆవులు, గేదెలను మాంసం దుకాణాలకు అమ్మకూడదు. కేవలం రైతులకు మాత్రమే విక్రయించాలి. అదీ గుర్తింపు కార్డులున్న రైతులకు మాత్రమే అమ్మాలి. భూములున్న రైతులు మాత్రమే కొనుగోలు చేయాలి. గిత్తలను అస్సలు అమ్మకూడదు. ఎద్దులు, ఆవులు, గేదెలు, కోడెలతో పాటు ఒంటెల అమ్మకాలు ఇష్టానుసారంగా జరగకూడదు. ఈ కొత్త చట్టం రాబోయే మూడు నెలల్లో అమల్లోకి రానుంది. అమ్మకాలు, కొనుగోళ్లు జరిపే వాళ్లు కచ్చితంగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాల్సిందే. మరింత పేపర్ వర్క్ జరగాల్సి ఉండటంతో అమల్లోకి రావడానికి సమయం పడుతుందన్నారు. ఈ కొత్త చట్టాన్ని దివంగత పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే ఉండగానే రూపొందించారు. సుప్రీం కోర్టు సూచనతలో చట్టం రూపుదిద్దుకుంది.

 

పశు సంవర్థఖ శాఖ అనేది రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. మరి కేంద్రం ఈ చట్టం ఎలా అమలుచేస్తుందో తెలియదు. గోవధ మీద దేశ వ్యాపిత నిషేధం విధించాలని ఒక పిల్ దాఖలయినపుడు , అది రాష్ట్రాల పరిధిలోని అంశమని చెబుతూ సుప్రీంకోర్టు పిటిషన్ ను స్వీకరించలేదు.

 

ఈ చట్టం దుష్పరిణాలు తీసుకువస్తుందని ఆందోళన కొందరిలో మొదలయింది. ముఖ్యంగా భారత దేశం మాంసం మార్కెట్ పతనమవుతుంది. కొన్ని వర్గాలకు మాంసం అందుబాటులో లేకుండా పోతుంది.

 

చట్టంలో పొందుపర్చిన నిబంధనలు:

 

.. ఆవును కొనుక్కున్నవాళ్లు .. ఐదు రకాల ఆధారాలను కచ్చితంగా చూపించాలి. రెవెన్యూ ఆఫీస్, స్థానిక పశువైద్యుడు, పశువుల మార్కెట్ లో వీటిని అందించాలి.

.. పశువధకు కాదని, వ్యవసాయానికి ఉపయోగిస్తున్నట్టు నిరూపించాలి.

.. జంతువధ నిరోధక చట్టం 1960, సెక్షన్ 37, సెక్షన్  38 లకు   అనుగుణంగా ఈ నిషేధం విధించారు.

click me!