
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఫారిన్ ఇన్వెస్టమెంట్లంటే చాలా ఇష్టం.
ఫారినోళ్లు ఇక్కడకి రావడమో, మనం ఫారిన్ వెళ్లి ఇన్వెస్టమెంట్లు పెట్టడమో చేయాలని చెబుతుంటారు.
ఏదయితే ఏ ముంది ఆయన దారి ఇన్వెస్ట్ మెంట్ల దారి. ఇన్వెస్ట మెంట్ల కోసం ఆయన పారిన్ కంట్రీస్ ఎన్నితిరిగారో. ఆయనే కాదు, మంత్రులు,అధికారులు, సలహాదారులు కూడ ఇన్వెస్ట్ మెంట్స్ కోసం తెగ తిరిగేస్తున్నారు. ఛైనా, జపాన్, సింగపూర్, మలేషియా, కొరియా.... ఆయనదంతా లుక్ ఈస్ట్ పాలసీ. ఈ మధ్య ఆయన దుబాయ్ వెళ్లాల్సిం ఉండింది. వెళ్లలేకపోయారు. అది మిడిల్ ఈస్ట్ అనుకోండి.
ఈ మధ్య అధికారులతో మాట్లాడుతూ సింగపూర్ మోడల్ ఫాలో అయితే మనమూ సింగపూర్ కంటే రిచ్ అవుతామన్నారు. సింగపూర్ మోడల్ ఏంటంటే, సింగపూరోళ్లు విదే శీపెట్టుబడులను ఆకట్టు కోవడమే కాదు, వాళ్లు కూడా బయటిదేశాలలో పట్టుబడులు పెట్టి లాభాలు బాగా ఆర్జించడం. అయితే, ఎప్పటినుంచో ఈ మోడల్ ఫాలో అవుతున్న తమ్ముడున్నట్లు ఇపుడు బయట పడింది.
తెలుగుదేశం సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎప్పటి నుంచో , రఫ్ గా 2001 నుంచే , సింగపూర్ మోడల్ ఫాలో అవుతున్నారు. విదేశాలలో భారీగా పెట్టుబడులు పెట్టి నాయుడి మాట ముందే నిలబెట్టారు . అయితే, ఇదంతా దొడ్డి దారిలో, దొంగదారిలో మానీ లాండరింగ్ దారిలో ... అని ఆరోపిస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన వైసిపి నేత కాకాణి గోవర్ద న్ రెడ్డి.
ఏమయినా సరే, ఇప్పటికందిన సమాచారం మేరకు తెలుగుదేశం, తెలుగు రాష్ట్రం నుంచి నుంచి విదేశాలలో పెట్టుబడులు (ఏదో ఒకదారిలో) పెట్టి నెంబర్ వన్ అనిపించుకున్న మొదటి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయనకు ఉత్తమ పారిశ్రామిక వేత్త అవార్డు ఇవ్వాల్సిందే. ఎందుకంటే, మనకు తెలియకుండా, చక్కగా విదేశాలలో భూములు కొన్నారు, భవనాలు కొన్నారు. వ్యాపారం చేశారు. కొడుకు కూతుర్ల ను ఇన్వెస్ట్ చేసేలా ప్రోత్సహించారు. విదేశీ బ్యాంకులకు డాలర్లు ట్రాన్స్ ఫర్ చేయించారు. విదేశాలలో ఫిక్స్ డ్ డిపాజిట్లున్నాయి.
కన్ఫ్యూజ్ కాకుండా వుండేందుకు విదేశీ వ్యవహారా శాఖకు ఒక ప్రత్యేక ఫోన్ కూడా వాడుతున్నారట. సోమిరెడ్డి కుటుంబ సభ్యుల వ్యవహరాలన్నీ హంకాంగ్, మలేషియా, సింగపూర్ లతో సాగడం గర్వకారణం. ఎందుకంటే చంద్రబాబు లూక్ ఈస్ట్ పాలసీకి లోబడే ఈ వ్యవహారాలు నడిచినట్లు కనిపంచడం లేదూ. ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ సోమిరెడ్డి ఇపుడు కేవలం పార్టీ అధికార ప్రతినిధి మాత్రమే. ఇపుడు పెట్టుబడుల సలహాదారుగా ఉండేందుకు అన్ని అర్హతలున్నాయని విదేశాలలో ఆయన పెట్టిన పెట్టుబడులు చూస్తూ అర్థమవుతుంది.
పేదవాడిని చెప్పుకునే సోమిరెడ్డి, నెల్లూరు ఇల్లు తప్ప మరేమీ లేదనే సోమిరెడ్డికి ఇంత వ్యాపారం ఎక్కడిది? లేక ఇదంతా ఏవరయిన ‘పెద్దాయన’ దా.