నోట్ల రద్దు బలవంతపు కు.ని. ఆపరేషన్ లాంటిది

Published : Dec 23, 2016, 02:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
నోట్ల రద్దు బలవంతపు కు.ని. ఆపరేషన్ లాంటిది

సారాంశం

మోదీ నిర్ణయాన్ని ఏకిపడేసిన ఫోర్బ్స్ మ్యాగజైన్


పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయాన్ని ప్రఖ్యాత మ్యాగజైన్ ఫోర్బ్స్ తీవ్రంగా తప్పుపట్టింది.

 

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం అనేది ప్రజల సొత్తును దోచివేయడంగా అభివర్ణించింది.

 

ప్రజాస్వామ్యదేశంలో ప్రజల హక్కులను కాలరేసి చర్యగా డీమానిటైజేషన్ ను పేర్కొంది.

 

1975 లో ఇందిరాగాంధీ హయాంలో ప్రారంభించిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లాంటిది మోదీ చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రకటన అని అభివర్ణించింది.

 

దీని వల్ల పేదలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో భారత్ ఆర్థికవ్యవస్థపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించింది.

 

పెద్ద నోట్ల రద్దు వల్ల ఉగ్రవాదుల చర్యలు తగ్గిపోతాయని భారత్ భ్రమల్లో ఉందని అది ఎంత మాత్రమూ సరికాదని పేర్కొంది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !