ఇక్కడ పవన్ ఫ్యాన్స్ .. అక్కడ ధోని ఫ్యాన్స్.. !

Published : Dec 23, 2016, 04:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ఇక్కడ పవన్ ఫ్యాన్స్ .. అక్కడ ధోని ఫ్యాన్స్.. !

సారాంశం

అశ్విన్  2016కు గానూ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను దక్కించుకున్నాడు.

 

అభిమానం ఉంటే తప్పులేదు... పిచ్చి అభిమానం ఉండటమే తప్పు.. టాలీవుడ్ లో ఏ సినిమా హీరో  ఫంక్షన్ జరిగినా పవర్ స్టార్ ఫ్యాన్స్ హాజరవడం.. పవన్ కల్యాణ్ కు జిందాబాద్ లు కొట్టడం రోటీన్ గా మారింది.

 

చివరకు ఇది పవర్ స్టార్ కూ కూడా చికాకు తెప్పించింది. వార్నింగ్ లు ఇచ్చినా వారు మారే అవకాశం కనిపించడం లేదు.

 

ఇప్పుడు ధోనీ ఫ్యాన్స్ కూడా అలానే తయారయ్యారు. భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ కెప్టెన్ లలో ధోనీ ఒకరని అందరూ అంగీకరించే విషయమే.  ఈ విషయమంలో అందిరికీ ఏకాభిప్రాయం ఉంది.

 

కొంత కాలంగా ఫాం కోల్పోయిన ధోనీ.. టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. విరాట్ కొహ్లీ పగ్గాలు చేపట్టాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు.

 

బౌలర్లను వాడుకోవడంలో కోహ్లీ చాలా తెలివిగా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో కోహ్లీ వ్యూహం, అశ్విన్ స్విన్ మాయాజాలం బాగా పనిచేశాయి.

 

అందుకే అశ్విని 2016కు గానూ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను దక్కించుకున్నాడు.

 

దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ అశ్విన్ తన ట్విటర్ లో కోచ్ కుంబ్లేకు, కెప్టెన్ విరాట్ కు తన తల్లిదండ్రులకు కృతజ్ఝతలు వ్యక్తం తెలిపాడు.


పాపం.. ఇక్కడే ధోనీ ఫ్యాన్స్ కు తెగ కోపం వచ్చేసింది.  తమ హీరో పేరు ఎందుకు ప్రస్తావించలేదని సోషల్ మీడియాలో తెగ ఫీలైపోతున్నారు.

 

కానీ, ధోనీ ఫ్యాన్స్ టెస్టు క్రికెట్ చూడడం మానేశారా ఏంటీ.. ఇప్పుడు కెప్టెన్ గా ఉంది విరాట్ కోహ్లీ.  పైగా ధోనీకి అశ్విన్ కి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.

 

ప్రపంచ నెంబర్ వన్ బౌలర్లలలో ఒకడిగా ఉన్న అశ్విన్ ని కావాలనే ధోనీ ఇటీవల కొన్ని  వన్డే జట్టు లోకి తీసుకోలేదనేది అందరికీ తెలిసిన విషయమే.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !